Andhra Pradesh: ఈరోజు ఢిల్లీకి పవన్ కల్యాణ్...పొత్తు ఖరారయినట్లేనా!

ఎన్నికల ముందు ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. నేతలందరూ ఒక్కొక్కరే ఢిల్లీ బాట పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు జనసేన అదినేత పవన్ కల్యాణ్ కూడా హస్తినకు వెళ్ళారు.

New Update
Andhra Pradesh: ఈరోజు ఢిల్లీకి పవన్ కల్యాణ్...పొత్తు ఖరారయినట్లేనా!

Jansena Cheif Pawan Kalyan Delhi Tour: ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులపై (TDP - Janasena Alliance) ఒక క్లారిటీకి వచ్చాయి. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల పంపకాల మీద చర్చలు జరిపారు. ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరితో ఇప్పుడు బీజేపీ (BJP) కూడా కలవనుంది అని తెలుస్తోంది. నిన్న ఢిల్లీ వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అమిత్ షా, నడ్డాలను కలిశారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ ను కూడా ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారని సమాచారం. అక్కడ చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇరువురూ కలిసి ఈరోజు మళ్ళీ అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలను కలవనున్నారని చెబుతున్నారు. ఆంధ్రాలో పొత్తుపై మాట్లాడుకుంటారని చెబుతున్నారు.

Also Read:Telangana:15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాలు..నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

నిన్న అమిత్ షాను కలిసిన చంద్రబాబు..

బుధవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. జేపీ నడ్డా, అమిత్‌ షాలతో ఆయన సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్‌లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. అలాగే ఎన్డీయేలో చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కంటే ముందుగా జేపీ నడ్డా (JP Nadda) వెళ్లినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా.. 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు తమకు కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. 3 ఎంపీ సీట్లు, 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఏకాభిప్రాయానికి వచ్చిన టీడీపీ,జనసేన..

సీట్ల సర్దుబాటులో మల్లగుల్లాలు పడిన టీడీపీ, జనసేన పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ 145, జనసేనకు 21, బీజేపీకి 9 అసెంబ్లీ ఇస్తారని చర్చ జరుగుతోంది. అయితే జనసేన తమకు 25 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు బీజేపీ అధినేతలతో సమావేశం తర్వాత ఈ మొత్తం విషయం మీద ఒక క్లారిటీ రావొచ్చును. బీజేపీతో పొత్తు ఫైనల్ అయితే ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజీఏపీల మధ్య చర్చలు సజావుగా సాగాయని చెబుతున్నారు టీడీపీ నేత సుజనా చౌదరి.

Advertisment
తాజా కథనాలు