Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు

ఆంధ్రప్రదేశ్‌కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

New Update
Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు

Paramilitary Forces In AP : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు (Paramilitary Forces) వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ (Strong Room) ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా పరిశీలించనున్నారు. ఇటీవల పోలింగ్ జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాతో సహా మరికొన్ని నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హింసాత్మక ఘటన జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేశారు. తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ అల్లర్లపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగింది.

Also read: ఏపీలో హింసపై రంగంలోకి సిట్.. వారిపై కఠిన చర్యలు!

అయితే ఇటీవలే 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం (Election Commission).. కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీంతో ఈరోజు రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి

Also read: సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల సంచలన ట్వీట్

Advertisment
తాజా కథనాలు