YS Sharmila Tweet On CM Jagan: మాజీ మంత్రి వివేకా హత్య ( Viveka Murder Case) గురించి మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు షర్మిల, సునీతకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ షర్మిల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కడప కోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని… వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
పూర్తిగా చదవండి..YS Sharmila: సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ షర్మిల సంచలన ట్వీట్
AP: వివేకా హత్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు షర్మిల. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే అని అన్నారు.
Translate this News: