Palnadu 144 Section: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. 62 మంది అరెస్ట్‌!

పల్నాడు ఏరియాలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది.

New Update
Palnadu 144 Section: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. 62 మంది అరెస్ట్‌!

Palnadu 144 Section: ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరేగుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు(Palnadu) ఏరియాలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు.

ముందుగానే షాపులన్నీ మూసేయించిన పోలీసులు.. ఇప్పటికే నర్సరావుపేటలో 62 మంది అరెస్ట్‌ చేశారు. అలాగే కారంపూడిలో దాడుల వీడియోల ఆధారంగా గొడవలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ALSO READ: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు

Advertisment
తాజా కథనాలు