Jainuru: భగ్గుమన్న జైనూరు...144 సెక్షన్ విధింపు!
ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీయడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు