India-pak:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్.. భారతలోకి పాకిస్తాన్ డ్రోన్ ఒకటి చొచ్చుకుని వచ్చింది. ఫిరోజ్ పుర్ జిల్లాలోని టిండీ వాలాలో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని కనుగొన్నారు. By Manogna alamuru 14 Nov 2023 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి భారత్-పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. భారత్ లోకి ఎలాగోలా రావడానికి, మన రహస్యాలను తెలుసుకోవడానికి ఆ దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పుడు అదును దొరుకుతుందా మన దేశం మీద అటాక్ చేద్దామా అని చూస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఏళ్ళ తరబడి కొనసాగుతున్న రైవలరీని కొనసాగిస్తూ ఉంటుంది. బోర్డర్ లో కంటి మీద రెప్ప వేయకుండా మన జవాన్లు కాపలా కాస్తున్నా మన దేశంలోకి చొరబడ్డానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా పాక్ డ్రోన్ ఒకటి మన దేశంలోకి వచ్చింది. Also read:నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేసే చిల్డ్రన్స్ డే. బోర్డర్ లోరి ఫిరోజ్ పుర్ జిల్లాలో టిండి వాలా అనే గ్రామంలో బీఎస్ఎఫ్ జవాన్లు ఒక డ్రోన్ ను కనుగొన్నారు. అది పక్క దేశం పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు కనుగొన్నారు. దీంతో అసలు ఆ డ్రోన్ ఏంటి? ఎందుకు మన దేశంలోకి వచ్చింది? దీని ద్వానా పాకిస్తాన్ ఏం చేయదలుచుకుంది అనే విషయాలను పరిశీలిస్తున్నారు మిలటరీ అధికారులు. ఇలా డ్రోన్ రావడం సస్పెక్ట్ చేసేదిగా ఉన్నా...ఇంకే ఇతర అలజడులు లేకపోవడంతో ఆందోళన పడవలసిన అవసరం లేదని చెబుతున్నారు. మనకు వ్యతికేంగా పాకిస్తాన్ కు చైనా సహకరిస్తోందిన అన్నది బహిరంగ రహస్యం. అందుకు నిదర్శనంగా చైనా, పాకిస్థాన్లు అరేబియా సముద్రంలో భారీ నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉమ్మడిగా సాగర గస్తీని నిర్వహిస్తున్నాయి. ఈ నెల 17 వరకూ కొనసాగుతాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, సంప్రదాయ స్నేహాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇరు సైన్యాల శిక్షణను మరింత సానబెట్టే క్రమంలోనే మూడోసారి ఈ తరహా విన్యాసాలు నిర్వహిస్తున్నామని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి చెబుతున్నారు. Also Read:తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..! #suspected #drone #border #pakistan #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి