Telangana: తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..!

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నవంబర్ 17వ తేదీన అమిత్ షా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. బీజేపీ సభల్లో షా, కాంగ్రెస్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

New Update
Telangana: తెలంగాణకు జాతీయ నేతల క్యూ.. ఒకే రోజు ఒకే చోట అమిత్ షా, రాహుల్ సభలు..!

Telangana Elections 2023: తమ ప్రతాపం అంతా పండుగ తరువాతే అని ప్రకటించిన నేతలందరూ.. దీపావళి పండుగ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. మొత్తానికి దీపావళి ముగిసిపోయింది. ఇక తెలంగాణ(Telangana) ఎన్నికల్లో ఢంకా మోగించుడే అంటూ రాష్ట్రానికి జాతీయ నేతల ఆగమనం షురూ అయ్యింది. తెలంగాణ ఎన్నికలను హోరెత్తిస్తామంటూ వచ్చేస్తున్నారు జాతీయ నేతలు. తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కట్టారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు వస్తున్నారు.

అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తుండగా.. రాహుల్ గాంధీ పార్టీ ఏర్పాటు చేస్తున్న బహిరింగ సభలో పాల్గొంటున్నారు. అయితే, ఈ ఇద్దరు నేతలు ఒకే రోజు.. అది కూడా వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 17న తెలంగాణకు వస్తున్న అమిత్ షా బీజేపీ ఏర్పాటు చేస్తున్న మొత్తం 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌ సభల్లో షా పాల్గొంటారు. ఇక అదే రోజున కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరి సభలకు రాహుల్ హాజరుకానున్నారు.

బీజేపీ మేనిఫెస్టో ప్రకటించనున్న అమిత్ షా..

తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో కీలక అంశాలు పొందుపరిచినట్లు సామాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఈ మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సారథి కిషన్ రెడ్డి. దీనికి అదనంగా సెంటిమెంట్‌ను జోడించే అంశాలు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, ప్రతి వ్యక్తికి బీమా పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. అలాగే వరికి మద్దతు ధర రూ. 3,100 పెంచుతామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సమాచారం. నిరుద్యోగుల దృష్టిని ఆకర్షించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధి అవకాశాలపై హామీలుండే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన బీజేపీ.. 19వ తేదీన తన మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Also Read:

టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు