ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం అభిప్రాయం అడిగినందుకే యూట్యూబర్‌లను కాల్చి చంపేశాడు సెక్యూరిటీ గార్డు. భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధంలా ఉంటుంది ఎప్పుడూ. ఇరు దేశాల్లో దీన్ని కేవలం మ్యాచ్ కింద ఎప్పుడూ చూడరు. ఇదే దృష్టి ఇప్పుడు యూట్యూబర్ ప్రాణాలను బలిగొంది. ఆదివారం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సాద్ అహ్మద్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అంతే మైక్ పట్టుకుని కరాచీలోని ఓ మార్కెట్‌లోకి వెళ్ళాడు. చాలా మందితో మాట్లాడాడు.
అయితే సడెన్‌గా ఇందులో ఊహించని ఘనట ఎదురైంది సాద్‌కు. ఇంటర్వ్యూలో భాగంగా అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను సాద్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ గురించి అడిగాడు. అతను స్పందించలేదు. అయినా కూడా సాద్ అతన్ని ఆ ప్రశ్న పదేపదే అడుగుతూనే ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్ ఎంత తప్పించుకుందామని చూసినా వదల్లేదు. దీంతో సహనం కోల్పోయిన గార్డ్ తన దగ్గర ఉన్న తుపాకీతో సాద్ మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు.
Also Read:World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు