Kishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్‌తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. By V.J Reddy 11 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy About Lok Sabha Elections: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ (Telangana BJP) అన్ని స్థానాల్లో విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్? టార్గెట్ తెలంగాణ @17 సీట్లు... మరి కొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నారు. దీనిపై కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టే గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ తోనే పోటీ... దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తమకు పోటీలోనే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీకి (PM Modi) ఎదురు నిలిచే ఏ కూటమి గాని, పార్టీ గాని లేదని అన్నారు. బలమైన ప్రభుత్వం వల్లే దేశ ప్రజల ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో కూడా తమకు కాంగ్రెస్ పార్టీ తోనే పొత్తు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) కనిపించదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ తమకు పోటే కాదని అన్నారు. మేడిగడ్డ మేం చూశాం.. మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project) ను తాము ఇదివరకే పరిశీలించి వచ్చామని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు తాము మరోసారి మేడిగడ్డ ప్రాజెక్ట్ ను చూడాల్సిన పని లేదని అన్నారు. కేసీఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. కృష్ణ జలాల వివాదంపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం కలిసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. సంకల్ప యాత్రలు (Vijay Sankalp Yatra).. 1. అదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ దీనికి కొమురం భీమ్ యాత్ర గా నామకరణం 2. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్ , చేవెళ్ల (శాతవాహన యాత్ర) 3. ఖమ్మం వరంగల్ మహబూబ్ బాద్ (కాకతీయ యాత్ర) 4. భువనగిరి , సికింద్రాబాద్ , హైదారాబాద్ , మల్కాజ్ గిరి (భాగ్యనగరి యాత్ర) 5. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు, నల్గొండ కృష్ణమ్మ యాత్రగా నామకరణం చేశారు. DO WATCH: #brs #congress #bjp #kishan-reddy #bjp-kishan-reddy #mp-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి