Review: నో లాజిక్,ఓన్లీ కామెడీ..ఇలా అనుకుని వెళితే ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు..ఓం భీం బుష్ మూవీ రివ్యూ లాజిక్ లేకపోయినా పర్వాలేదు...కామెడీ ఉంటే చాలు అనుకుంటే ఈరోజు విడుదల అయిన ఓం భీమ్ బుష్ సినిమాకు వెళ్ళండి. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన ఈ మూవీ మంచి వినోదాన్నే అందించింది అంటున్నారు తెలుగు ఆడియెన్స్. దీని విశేషాలేంటో మీరూ లుక్కేసేయండి. By Manogna alamuru 22 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Om Bheem Bush Movie Review: హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగొంటి (Sree Harsha Konuganti) అవుట్ అవుట్ కామెడీతో తీసిన సినిమా ఓం భీం బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకుని బయటకు వస్తున్నారని టాక్. కథ.. శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణలు (Rahul Ramakrishna) పీహ్యడీ చేస్తున్న స్టూడెంట్లు. క్రిష్, వినయ్ గుమ్మడి, మాధవ్ రేలంగా అలియాస్ మ్యాడీ వీళ్ళ పేర్లు. ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. సైంటిస్టులు కావాలనే వీళ్ళ కల. అయితే అదే ఉద్దేశంతో ఒక ప్రొఫెసర్ దగ్గర స్టూడెంట్స్‌గా చేరుతారు. కానీ ఎంతకీ దాన్ని పూర్తి చేయరు. పైగా ఫ్రొఫెసర్‌ను నానా తిప్పలు పెడతారు. దీంతో వాళ్ళ బాధ భరించలేక ఆయన వాళ్లకు డాక్టొరేట్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తరువాత ఏం చేయాలో తెలియని ఈ ముగ్గురూ భైరవపురం అనే ఊరులో అన్ని సమస్యలూ తీసుస్తామంటూ ఒక దుకాణం తెరుస్తారు. నిజంగానే ఊరి వాళ్ళ సమస్యలు తీరుస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే ఇదంతా ఆ ఊళ్ళోనే ఉంటున్న ఒక భూతవైద్యుడికి కంటగింపుగా ఉంటుంది. దాంతో ఆ ఊరిని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సంపంగి అనే దయ్యం ఉన్న కోటలోకి వెళ్లి నిధిని బయటికి తీసుకురావాలని సవాలు విసురుతాడు. ఈ నిధికి, తాను ప్రేమించిన అమ్మాకి కూడా లింకు ఉంటుంది. దీంతో తన ఇద్దరు స్నూమితులను తీసుకుని కోటలోకి అడుగుపెడతాడు కృష్ణకాంత్ అలియాస్ క్రిష్. అక్కడ వీరికి ఎదురైన అనుభవాలేంటి.. ఇంతకీ సంపంగి దయ్యం కథేంటి.. దాన్ని తప్పించుకుని ముగ్గురూ నిధిని దక్కించుకోగలిగారా...తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రివ్యూ... అసలు సినిమా పేరే వింతగా ఉండి వినగానే నవ్వు తెప్పించేదిగా ఉంది. దీన్ని చూడగానే ఇది ఫుల్ కామెడీ సినిమా అని అర్ధం అయిపోతోంది. దానికి తోడు ఇందులో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్నలు ప్రధాన పాత్రల్లో చేయడం కూడా ప్లస్ పాయింట్‌గా మారింది. ఇంతకు ముందు వీళ్లు ముగ్గురూ కలిసి చేసిన బ్రోచేవారెవరురా సినిమా కూడా సూప్ హిట్ అయింది. ఇక ఓం భీమ్ బుష్ టైటిల్‌కు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ ఇచ్చారు. అంటే సినిమా గురించి ఏం ఆశించొద్దని డైరెక్టర్ ముందే చెప్పేశారు అన్నమాట. దానికి తగ్గట్టే ఉంది మూవీ కూడా. అందుకు తగ్గట్టే స్క్రిప్టు రాయడంలో కానీ.. సినిమా తీయడంలోనూ ఏ హద్దులూ.. పద్ధతులూ పెట్టుకోలేదు. ఇందులో హీరోలు ఏమనుకుంటే అది చేస్తారు.. వాళ్లు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. దయ్యం పడితే వదిలించేస్తారు.. సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటే పెంచేస్తారు.. ఇంకా రకరకాల పనులు చేసేస్తారు. సినిమా మొదలైన దగ్గర్నుంచి లాజిక్ అనే మాటే ఉండదు. సినిమాలో చాలాచోట్ల సైంటిస్టులు ఈ పనులు అన్నీ చేయడమేంటీ అనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.కానీ ముందే చెప్పారుగా లాజిక్కులు వెతకొద్దని. కాబట్టి అలానే చూస్తే హాయిగా ఎంజాయ్ చేసి రావొచ్చు. లేకపోతే మాత్రం ఏంటీ అర్ధం పర్ధం లేని సినిమా అంటూ తలనొప్పి రావడం గ్యారంటీ. Thoroughly enjoyed #OmBheemBush. A different yet hilarious entertainer. Kudos to the team for selecting a unique story and taking this route. Congratulations to @sreevishnuoffl, @HarshaKonuganti , @vcelluloidsoffl & @UV_Creations for the wonderful film.#OBB@PriyadarshiPN… pic.twitter.com/DhA7SxKFJ5 — Director Maruthi (@DirectorMaruthi) March 22, 2024 అసలు ముందు నుంచు హీరోలు డంబ్‌లో అయితే సినిమా హిట్ అవుతుంది అనే ఫార్ములానే తెలుగు దర్శకులు ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. జాతిరత్నాలతో ఇది మరింత ఊపందుకుంది. అచ్చం అందులోలాగే ఇందులో కూడా ముగ్గురూ తెగ అల్లరి చేస్తూ ఉంటారు. దాంతో పాటూ దర్శకుడు సోషల్ మీడియాను కాచి వడపోసినట్టున్నాడు. పాపులర్ మీమ్స్ అన్నింటినీ ఉపయోగించుకుంటూ క్రేజీ డైలాగ్స్ రాశాడు. కాదేదీ జోకులకు అనర్హం అన్నట్లు చివరికి ఈ చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తీసిన డిజాస్టర్ మూవీ 'ఆదిపురుష్' మీద కూడా పంచులు వేసేశాడు. అయితే సినిమా కథకూ...సీన్లకు, డైలాగులకు మాత్రం ఏం సంబంధం ఉండదు. ఒక పద్ధతి లేకుండా సాగుతాయి.కానీ డైరెక్టర్ చచెప్పింది గుర్తుంది కదా...నో లాజిక్స్. సీన్లు సీన్లు గా ఉన్నా కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారంటే ఓం భీం భుష్‌కు తప్పకుండా వెళ్ళండి. It is 𝐋𝐎𝐋 time in theatres with #OmBheemBush ❤️🔥 Takes off to a terrific word of mouth and laughs at the box office. THIS SUMMER, there is NO LOGIC - ONLY MAGIC ✨ Book your tickets now! 🎟️ https://t.co/lwRisfj1xM Directed by @HarshaKonuganti#OBB@sreevishnuoffl… pic.twitter.com/AcdO2mmhNt — UV Creations (@UV_Creations) March 22, 2024 ఇక సెకండ్ హాఫ్‌లో హీరోలు ముగ్గురూ కోటలోకి అడుగుపెడతారు. అప్పటి నుంచీ ఒక మామూలు తెలుగు హార్రర్ కామెడీ మూవీ చూస్తున్నట్లే అనిపిస్తుంది. కోటలో ముగ్గురూ భయపడుతూనే నిధి కోసం వెతుకుతుంటారు. వారిని దయ్యం వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో రొటీన్ అయినప్పటికీ కామెడీ వర్కవుట్ అయింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ అయి తెగ బోర్ కొట్టిస్తాయి. కానీ దెయ్యం బ్యాక్ స్టోరీ మాత్రం వెరైటీగా అనిపిస్తుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత మళ్లీ ఈ సినిమాలో దెయ్యాన్ని ఢిఫరెంట్ గా చూపించారు. భయం పోయి సానుభూతి కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీని తరువాత దయ్యం కోసం హీరో తీసుకునే నిర్ణయం కూడా క్రేజీగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా లాజిక్ కంటే మ్యాజిక్ గురించే ఆలోచించాడు దర్శకుడు. ముగింపు సన్నివేశాలు కూడా మంచి వినోదాన్నే అందిస్తాయి. మొత్తానికి ఓం భీం బుష్ సినిమా ఓన్లీ కామెడీగా అలరించింది. నవ్వకుంటే చాలు మిగతావి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వారు హాయిగా ఒకసారి వెళ్ళి చూసేయొచ్చు. మూవీ పెద్ద హిట్ కాకపోయినా...ఓ రేంజ్ వరకు ఆడుతుంది. థియేటర్లలో కన్నా ఓటీటీల్లో బాగా ఆడుతుంది ఓం బీం బుష్ మూవీ. ఇక ఇందులో అడల్ట్ జోక్స్ అయితే మాత్రం యూత్‌కు ఒక క్రేజీ రైడే ఇస్తాయి. #OmBheemBush: Simply madness!🙏 A senseless - logic less - wildly entertaining film throughout start to end. The film is all about the hilarious punches, timing of #SreeVishnu, #Priyadarshi, and #RahulRamakrishna 🔥, they are truely delight. The horror element and a new… — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 21, 2024 నటీనటులు.. మొదట్లో శ్రీవిష్ను సీరియస్ పాత్రలే అన్నీ చేశాడు.కానీ తరువాత తనని తాను మార్చుకుని కామెడీ హీరోగా కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఓం భీం బుష్‌లో శ్రీవిష్ణు చేసిన కృష్ణకాంత్ పాత్ర అతని కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పవచ్చును. ఐయామ్ క్రిష్.. అమ్మాయిల మనసులను చేస్తా ఫిష్'' అంటూ టిపికల్ డైలాగ్ డెలివరీతో అతను చెప్పే డైలాగులు మంచి వినోదం పంచుతాయి. దయ్యంతో సరసాలాడే సీన్లలో శ్రీ విష్ణు భలే చేశాడు. సినిమా అంతా నవ్విస్తూ చివర్లో కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు శ్రీ విష్ణు. ఇక రాహుల్, ప్రియదర్శిలు గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. ఇద్దరూ సహజంగానే కామెడీ పండించగలరు. అందులో కలిసి యాక్ట్ చేస్తే ఇంక చెప్పడానికి ఏం ఉంది. ఎప్పటిలానే ఫుల్ నవ్వించి పడేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించిన కాసేపు ఆకట్టుకున్నాడు. రచ్చ రవి కూడా బాగా చేశాడు. ఆదిత్య మేనన్ పాత్ర కనిపించిన కాసేపు ఓకే అనిపిస్తుంది. హీరోయిన్లలో ప్రీతి ముకుందన్ చూడ్డానికి బాగుంది. తనకు పెద్దగా నటించే అవకాశం రాలేదు. చేపల కొట్టు అమ్మాయిగా ఆయేషా ఖాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. ఇక ఇందులో పాటలో సినిమా నుంచి బయటకు వచ్చాక గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బావుంది. సినిమాకు తగ్గట్టుగా ఉంది. ఓం భీం బుష్‌కు స్వామిరారా కు సంగీతం అందించిన సన్నీ ఎంఆర్ ఇచ్చారు. రాజ్ తోట ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ బాగానే ఉన్నాయి. రేటింగ్- 2.75/5 Also Read:Kejriwal Arrest: కేజ్రీవాల్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు #sree-vishnu #priyadarshi #movies #review #om-bheem-bush #rahul-ramakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి