Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్‌ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్‌ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు.

Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్
New Update

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్‌ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్‌ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు. చాలా మంది విద్యార్ధులు ఉమ్మడి రాష్ట్రంలో తమకు సరైన విద్య లేదని, తమ జీవితాలు ఆగం అవుతున్నాయని ఉద్యమ సమయంలో తనతో చెప్పారన్న ఆయన.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా అత్యాధునిక కళాశాలలను నిర్మించారని తెలిపారు.

publive-image

publive-image

విద్యార్థులు చదువుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మెడికల్ కాలేజీలను సైతం నిర్మించిందని వెల్లడించారు. మరోవైపు 2018 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ముందుదన్న ఆయన.. జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో మరో మణిహారం చేరినట్లైందన్నారు. సూర్యాపేట జిల్లాకు ఐటీ హబ్‌ రావడానికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అయితే.. తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ఖండాంతరాలకు పాకేలా చేసిన ఘనత మంత్రి కేటీఆర్‌ది అన్నారు.

publive-image

publive-image

ఐటీ హబ్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునే అవకాశం దక్కినట్లైందన్నారు. ఐటీ హబ్‌ ద్వారా గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో నిరుద్యోగి లేకుండా చేస్తామని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి వివరించారు. గతంలో ఐటీ రంగంలో కర్నాటక దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండేదన్న ఆయన.. ప్రస్తుతం తెలంగాణ కర్నాటకను వెనక్కి నెట్టి నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.

#jagadishwar-reddy #telangana #brs #cm-kcr #suryapet #job-mela #it-companies #it-hub #minister-ktr #minister-of-power
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి