IMD Issued Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న మేఘాలు..!!

తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!
New Update

IMD Issued Heavy Rain Alert: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం 115ఏళ్ల రికార్డుకు చేరువైంది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని ఉత్తర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కోస్తా కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా రాబోయే ఐదు రోజుల పాటు ఉత్తర ద్వీపకల్పం, మధ్యచ ఆనుకుని ఉన్న తూర్పు భారతదేశంతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుకైన రుతుపవనాల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది . రానున్న 24 గంటల్లో కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ నివేదించింది.

ఇది కూడా చదవండి: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

publive-image

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేశారో..మీ పని ఖతం..!!

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఇది అంచనా వేసింది. "మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు రాజస్థాన్, దక్షిణ గుజరాత్, ఈశాన్య భారతదేశంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని స్కైమెట్ ట్వీట్ చేసింది. గడిచిన 24 గంటల్లో ఒడిశాలోని బెళగుంతలో అత్యధికంగా 14 సెం.మీ వర్షపాతం నమోదైంది, పశ్చిమ బెంగాల్‌లోని అమ్‌గాచియా (12 సెం.మీ), అస్సాంలోని గోలాఘాట్ (11 సెం.మీ), కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని బొబ్బిలి (9 సెం.మీ), ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (9 సెం.మీ.) వర్షపాతం నమోదైంది. ఇక అటు దేశరాజధాని ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

#heavy-rainfall-alert #rains #imd #heavy-rain-alert #imd-issued-heavy-rain-alert #imd-predicts-heavy-rainfall #weather-updates #imd-rain-forecast #weather-update
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి