Australia : టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా

ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్‌ టాక్‌తో బోలెడు గ్లోబల్ యాప్‌లను, గేమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది.

Australia : టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా
New Update

China Monitoring  Internet Users : ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం(Australian Government), ఇతర విదేశాల నుండి నిధులు పొందే పరిశోధనా సంస్థ.. మే 2న ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో సమాచారం ప్రకారం చైనా(China) అన్ని దేశాల మీద నిఘా పెట్టింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారందరినీ(Internet Users) పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీని కోసం టిక్‌టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లను వాడుకుంటోందని చెప్పింది. ఫైమస్ యాప్‌లు, గేమ్‌లు అన్నీ కూడా చైనాకు ఇతరుల సమాచారాన్ని అందిస్తున్నాయని ఆధారాలతో సహా చూపించింది. వీటిల్లో రైడ్-షేరింగ్ యాప్ డిడి, యాక్షన్ గేమ్ జెన్‌షిన్ ఇంపాక్ట్ , ప్రసిద్ధ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ లాంటివి ఉన్నాయి.

గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఎకోసిస్టమ్‌(Global Information Ecosystem) ను పునర్నిర్మించడానికి.. ప్రపంచ అధికారంపై తన పట్టును బలోపేతం చేయడానికి, దాని కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి చైనా పట్టుదలగా ఉంది. దాంతో పాటూ తమ దేశ సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక ,సైనిక ప్రభావాన్ని పెంచడానికి.. విదేశాలలో తన ప్రభావాన్ని విస్తరించడానికి చూస్తోందని నివేదిక తెలిపింది. నివేదిక రాసిని ప్రధాన రచయిత సమంతా హాఫ్‌మన్ యాప్‌లు , గేమ్‌ల ద్వారా చైనా చాలా విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారని అంటున్నారు. అయితే చైనా మాత్రం దీని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అది కాకుండా ఆస్ట్రేలియాకు యాంటీ చైనా హిస్టీరియా ఉందని కూడా గతంలో ఆరోపించింది. మరోవైపు యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలోని ఆస్ట్రేలియా-చైనా రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ మెరీనా జాంగ్ ఈ నివేదికను ఖండించారు. అందులో వారు చెప్పిందంతా అతిశయోక్తిగా ఉందంటూ కొట్టిపారేశారు. చాలా పెద్దగా ఉన్నా..అన్ని సోషల్ మీడియా యాప్‌లను కంట్రోల్ చేస్తోంది అనడం అవాస్తవం అన్నారు.

అయితే ఆస్ట్రేలియా మాత్రం టిక్ టాక్‌(TikTok)ను నిషేధిస్తామని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పరికరాల్లో ఇది లేకుండా ఉండేటట్లు చూసుకుంటామని తెలిపింది.

#china #australia #games #apps #tik-tok
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe