ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. By Manogna alamuru 12 Sep 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలోకి ఎంటర్ అయినారు. ఈరోజు ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల నేతలూ ఇంపార్టెంట్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా యుద్ధం చేసేందుకు భారీగా ఆయుధాలు, మందు సామాగ్రి అవసరం ఉంది. దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ విషయం పక్కన పెడితే దీనికోసం కిమ్ ప్రయాణించిన రైలు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసారని చెప్పడంతో దాని స్పెషాలిటీతో ఏంటో అని ఆరాలు తీస్తున్నారు. కిమ్ ట్రావెల్ చేసిన రైలు పేరు తయాంఘో. దీనికి బోలెడు ప్రత్యేకతలున్నాయి. తయాంఘో అంటే కొరియన్ లాంగ్వేజ్ లో సూర్యుడు అని అర్ధం. నార్త్ కొరియాను కనిపెట్టిన కిమ్ ఇల్ సంగ్ కు గుర్తుగా దీనికి ఈ పేరును పెట్టారు. ఇదొక బుల్లెట్ ప్రూఫ్ రైలు. కిమ్ కు ఏమీ జరగకుండా సురక్షితంగా రష్యా చేరుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. మామూలు రైళ్ళ కంటే స్లోగా తయాంఘో నడుస్తుంది. కేవలం గంటకు 50 కిలోమీటర్ల స్పీడుతో మాత్రమే ప్రయాణించగలదు. ఈ ట్రైన్‌కు భారీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. సాయుధదళాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా స్టేషన్లను, రూట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేశారు. మొత్తం రైలులో 90 కోచ్ లు దాకా ఉన్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడి కోసమే ఈ రైలు ప్రత్యేకంగా తయారు చేశారు కాబట్టి ఇందులో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. హంగులూ, ఆర్భాటాలకు కొదువే లేదు. కిమ్ అతని అనుచరులు తినేందుకు స్పెషలైజ్డ్ ఛెప్స్ ఎలప్పుడూ రెడీగా ఉంటారు. రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్ వంటకాలను వీరు తయారు చేస్తారు. అలాగే ప్రపంచంలో లభించే ఖరీదైన మద్యం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మామూలుగా ఏదేశ నేతలు అయినా విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ట్రైన్ కంటే ఫ్లైట్ లో టైమ్ తక్కువ అవుతుంది అలాగే సేఫ్టీ కూడా. మరి కిమ్ ఎందుకు రైల్లో ప్రయానించారు అంటే దానికో కథ ఉంది. కిమ్ తండ్రి జోంగ్ ఇల్ కు విమానాలంటే భయంట. అందుకే ఆయన ఎక్కడుకు వెళ్ళాలన్నా ట్రైన్ లోనే ప్రయాణించేవారుట. ఎన్ని గంటలు అయినా సరే అలాగే చేసేవారు. ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అలాని ఎప్పుడూ రైల్లోనే వెళుతున్నారా అంటే లేదు....అవసరమైతే ఆయన విమానాల్లో కూడా ట్రావెల్ చేస్తారు. #train #kim-jong-un #russia #putin #north-koria #summit #weapons #special #arrived మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి