Mamata Banerjee: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్‌ సీట్ల పంపకంపై జరిపిన చర్చలు విఫలమయ్యాయని.. ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని.. బెంగాల్‌లో ఒంటరిగా పోరాడతామన్నారు.

New Update
Mamata Banerjee: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్
Mamata Banerjee: పార్లమెంటు ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు కలిసి ఏర్పాటైన ఇండియా కూటమి (INDIA Alliance).. . బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి.. పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ షాక్‌ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీతో (Congress Party) తమకు ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని క్లారిటీ ఇచ్చారు.

' ఇండియా కూటమిలో.. కాంగ్రెస్‌ సీట్ల పంపకంపై చర్చలు జరిపింది. కానీ అవి విఫలమయ్యాయి. మేము వారికి ఏ ప్రాతిపాదన ఇచ్చినా కూడా.. వాటన్నింటిని తిరస్కరించారు. మాకు కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధాలు లేవు.. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికలు పూర్తయ్యాక అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. అలాగే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) గురించి కూడా మాట్లాడారు. వాళ్లు మా రాష్ట్రానికి వస్తున్నారు.. మాకు సమాచారం ఇచ్చే మర్యాద కూడా వారికి లేదంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఈవీఎం ఎలా హ్యాక్‌ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్!

రెండు సీట్లే ఇస్తాం

తనను అవమానించడం కాంగ్రెస్‌కు పరిపాటి అయిపోయిందని.. సీట్ల పంపకాల విషయంలో కూడా పేచీ పెడుతోందంటూ మండిపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 10 నుంచి 12 సీట్లు కావాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోందని అన్నారు. అయితే.. దీదీ మాత్రం కేవలం రెండు సీట్లనే కాంగ్రెస్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్న తరుణంలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ ?

మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమంటూ తెలిపింది. ఇండియా కూటమికి.. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ (Trinamool Congress Party) ఓ బలమైన పిల్లర్‌గా భావించామని పేర్కొంది. అయితే మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీని (BJP) గద్దె దించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ సహాయం లేకుండానే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. టీఎంసీ నేత అధిర్ రంజన్ చౌదరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇది జరిగిన మరుసటి రోజే దీదీ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా దూమారం రేపుతోంది.

Also Read: రెండు సార్లు సీఎం..అతి సాధారణ జీవితం..కర్పూరి ఠాకూర్ గురించి ఆసక్తికర విషయాలు..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు