Syed Zafar Islam: బీజేపీ గ్రాఫ్‌పై తప్పుడు ప్రచారం వద్దు

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుందని విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యర్‌ జాఫర్‌ ఇస్లామ్‌ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏదో బీజేపీ పార్టీ స్థాయి ఏదో తెలుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్‌ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

New Update
Syed Zafar Islam: బీజేపీ గ్రాఫ్‌పై తప్పుడు ప్రచారం వద్దు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌లు స్కామ్‌ పార్టీలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ జాఫర్‌ ఇస్లామ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఆ వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందో ఎన్నికల ఫలితాలు వచ్చాక పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి అర్దమవుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఎన్ని నాటకాలు ఆడినా తాము ప్రజలకు నిజం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చాలా మంది దొంగలున్నారని సయ్యద్ జాఫర్ ఇస్లామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన దొంగ అన్న ఆయన.. దొంగల జాబితాలో సీఎం కేసీఆర్‌ కుతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత చేయి ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఎన్నికల అనంతరం దొంగలందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఏ కూటమిలో లేనటువంటి ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు.

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ పాలనకు చెరమగీతం పాడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ రైతులను రైతుబంధు, రైతుబీమ, ఉచిత విద్యుత్‌ పేరుతో మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఖర్చుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ గమనిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కూర్చునే సీఎం సామాన్యుల కష్టాలు పట్టించుకోరని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు