Nirmala Sitharaman Only Women in PM Cabinet: ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారోత్సం జరిగిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు. 2014లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా, ఆ తర్వాత రక్షణశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు 2024లో కూడా మూడోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ఏ పదవి ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..
ఇదిలాఉండగా.. నిన్న ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీళ్లలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ), శ్రీనివాస వర్మ(బీజేపీ) ఉన్నారు.
Also Read: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..