/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-8-8-jpg.webp)
Prabhas Look Video Viral : ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కల్కి 2998 ఏడీ’(Kalki 2898 AD) నుంచి మరో అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు చెబుతూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమానుంచి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా గూస్ బంప్స్ తెప్పించే మరో వీడియోను నెట్టింట షేర్ చేశారు.
𝐓𝐡𝐞 𝐭𝐢𝐦𝐞 𝐡𝐚𝐬 𝐜𝐨𝐦𝐞!
Announcement at 5 PM tomorrow. Stay tuned. #Kalki2898AD@SrBachchan@ikamalhaasan#Prabhas@deepikapadukone@nagashwin7@DishPatani@Music_Santhosh@VyjayanthiFilms@Kalki2898ADpic.twitter.com/xZWBq89olC
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 26, 2024
ఇది కూడా చదవండి:Rahul Gandhi: ఓటమి భయం కనిపిస్తోంది.. మోడీ కన్నీళ్లు పెట్టుకుంటారు!
ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు..
ఈ మేరకు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2998’ చిత్రం నుంచి ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్ చేయబోతున్నట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఇక ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో.. శివుడు రుద్రాక్షాలతో కొలువై ఉండగా.. ముకానికి ముసుగులో ఒక వ్యక్తిని (ప్రభాస్/ అమితాబ్ క్లారిటీ లేదు) చూపించారు. ఈ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతితోపాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow Us