Corona Virus : అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్..

అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 'ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ' అనే కొత్త విధానం ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు.

Corona Virus : అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్..
New Update

Vaccine : చైనా(China) లోని 2019 డిసెంబర్‌లో బయటపడ్డ కరోనా వైరస్(Corona Virus).. ఆ తర్వాత క్రమంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మందికి పైగా సోకింది. 70 లక్షల మందికి పైగా కొవిడ్‌(Covid-19) వల్ల మరణించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా అంతం కాలేదు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.

Also Read: మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ

ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ విధానంతో

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీన్ని అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త రకం కరోనా వైరస్‌లను కూడా ఈ వ్యాక్సిన్ ఎదుర్కోగలదని చెప్పారు. 'ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ' అనే కొత్త విధానం ద్వారా శాస్త్రవేత్తలు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2021లో ఆస్ట్రాజెనికా కంపెనీ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటితో కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని యూకే హైకోర్టులో ఇటీవల పిటిషన్లు దాఖలయ్యాయి.

ఆందోళన అవసరం లేదు

దీంతో తమ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా అరుదుగా థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసిటోపేనియా సిండ్రోమ్(TTS) వస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించింది. దీనివల్ల రక్తం గడ్డ కట్టడం, ఫ్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుందని పేర్కొంది. అలాగే వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా టీటీఎస్ వస్తుందని తెలిపింది. మన ఇండియాలో ఈ టీకాను కొవిషీల్డ్ అనే పేరుతో సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఉత్పత్తి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆరు వారాల్లోపే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయని అవి కూడా చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కోవిషీల్డ్ తీసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం

#telugu-news #national-news #covid-19 #corona-virus #covid-vaccine
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe