Accident : గుడిసెలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.