Watch Video: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
కేరళలోని మలప్పురం జిల్లాలో అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ తో ఐదేళ్ల బాలిక మరణించింది. ఇంతకు ముందు కూడా కేరళలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. మురికి నీటిలో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
దేశంలో 6 విడత పోలింగ్ ముగిసింది. 58 లోక్ సభ స్థానాలకుగానూ జరిగిన పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు పూర్తైంది. ఇప్పటివరకూ 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగగా.. జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఐఫోన్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్. ఇతరుల ప్రొఫైల్ చిత్రాల స్క్రీన్షాట్లను తీసుకోకుండా నిరోధించడానికి WhatsApp కొత్త సెట్టింగ్‌ను తీసుకువచ్చింది.వ్యక్తిగత గోప్యతకు అంతరాయం కలిగించే స్క్రీన్షాట్లను నిరోధించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇలాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ట్రైన్లో ఇద్దరు యువతులు గొడవపడ్డారు. మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ వాసులకు ఇదంతా కామన్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కేరళలో గూగుల్ మ్యాప్ ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ వాసులు విహార యాత్ర కోసం అలిప్పీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. అయితే, గూగుల్ మ్యాప్‌పై చూస్తూ వేగంగా డ్రైవ్ చేయడంతో కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లింది.
ప్రస్తుతం రాజకీయ నేతగా మారిన మరో సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. బీజేపీ 240 నుంచి 260 స్థానాల్లో గెలుస్తుందని.. కాంగ్రెస్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు.
కియా కొత్త SUV EV తీసుకువచ్చింది. EV3మోడల్ గా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. అధునాతన ఫీచర్లతో వస్తున్న కియా ఈ కొత్త SUV ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు