Watch Video: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. ఏడుగురు శిశువులు మృతి చెందారు. మరో 12 మంది పిల్లల్ని రెస్క్యూ టీం సిబ్బంది రక్షించారు. By B Aravind 26 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Fire Incident in Delhi Children's Hospital: ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని (Vivek Vihar) పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. ఏడుగురు శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో 12 మంది చిన్నారులను సహాయక బృందం రక్షించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు #telugu-news #childrens-hospital #delhi-fire-accident #fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి