Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది.  

New Update
mumbai

mumbai Photograph: (mumbai)

Zomato: ఫుడ్ ఆర్డర్ చేసుకునే కష్టమర్లకు బిగ్ అలర్ట్. పండగపూట మరో దరిద్రం తారసపడింది. ఓ జోమాటో డెలివరీ బాయ్ ప్యాకింగ్ ఆహారంలో ఉమ్మివేయడం కలకలం రేపుతోంది. ఓ భోజన ప్రియుడు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ను మధ్యలో ఒకచోట ఆపి అందులో ఉమ్మి వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై జనాలు తీవ్రంగా మండిపడుతుండగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

నడిరోడ్డుపై ఫుడ్ లో ఉమ్మి..

ఈ మేరకు ముంబైలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ దారుణం చేశాడు. ఆర్డర్ తెస్తున్న అతను మార్గమధ్యలో ఆపి నడిరోడ్డుపై ప్యాకింగ్ ఫుడ్ లో ఉమ్మి వేశాడు. అయితే ఇందుకు సంబంధించిన ఘటనను స్థానికంగా ఉండే రాకేశ్ సింహ అనే వ్యక్తి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కంజుర్ మార్గ్ ఏరియాలో డెలివరీ బాయ్ ఈ పనిచేసినట్లు చెబుతూ.. తన స్నేహితుడు, మ్యూజిక్ కంపోజర్ నారాయణ్ పార్వతీ పరశురామ్ ఈ వీడియో తీసి తనకు పంపించినట్లు తెలిపాడు. 

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

‘ముంబైలోని హుమా కంజుమార్గ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న టైం లో ఓ డెలివరీ బాయ్ ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూసే సరికి.. ప్రతి ప్యాకెట్ లో ఉమ్మి వేస్తున్నాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని ప్యాక్ చేస్తున్నాడు. వీడియో తీస్తూ నేను దగ్గిరికి వెళ్లడం చూసీ వెంటనే పారిపోయాడు’ అని నారాయణ్ చెప్పినట్లు వీడియోలో వివరించాడు. ఇది చూసిన నెటిజన్లు ‘ఫుడ్ సేఫ్టీ, హైజీన్ స్టాండర్డ్స్ పరిస్థితి ఏమిటి? నమ్మకంతో ఫుడ్ ఆర్డర్ చేస్తుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఇలా అయితే తినేది ఎలా’ అంటూ జోమాట్ కంపెనీతోపాటు డెలివరీ బాయ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. దీనిపై జొమాటో యాజమాన్యం స్పందిస్తూ.. ‘హై రాకేశ్. ఇలాంటి పనిని అస్సలు సహించం. ఈ ఘటన జరిగిన టైం.. లొకేషన్ మాకు  పంపించండి. వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం'అంటూ స్పందించింది. 

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

Also Read: Tamilanadu CM: తమిళనాడు తరువాత ముఖ్యమంత్రిగా ఆయనకే జైకొడుతున్న జనం!

 delivery-boy | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు