West Bengal: ఇది పెళ్లాం కాదు బాబోయ్.. ప్రియుడి కోసం భర్త కిడ్నీనే..

పశ్చిమ బెంగాల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తన భర్తకు మాయ మాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. వచ్చిన డబ్బులను తీసుకోని ఆమె తన ప్రియుడితో పరారైంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
 man sold his kidney after his wife convinced him that the money would help for their daughter’s marriage

man sold his kidney after his wife convinced him that the money would help for their daughter’s marriage

పశ్చిమ బెంగాల్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తన భర్తకు మాయ మాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. వచ్చిన డబ్బులను తీసుకోని ఆమె తన ప్రియుడితో పరారైంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో హవ్‌డా జిల్లాలోని ఓ మహిళ తన భర్త, కూతురుతో కలిసి ఉంటోంది. అయితే తమ కూతురు చదువు, పెళ్లి కోసం సరిపడా డబ్బు లేకపోడవంతో కిడ్నీ అమ్మేయాలని భర్తకు సూచన చేసింది. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు తీరిపోతాయంటూ మాయమాటలు చెప్పి నమ్మించింది. 

Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్‌ సర్వేలో సంచలన విషయాలు

భార్య పట్టుబడటం వల్ల చేసేదేమి లేక ఆ భర్త కిడ్నీని అమ్మేశాడు. ఇందకు ప్రతిఫలంగా రూ.10 లక్షలు వచ్చాయి. ఈ డబ్బుతో తమ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని అనుకున్నాడు. కానీ ఇక్కడే ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అతడి భార్య ఆ రూ.10 లక్షలు తీసుకొని ఫేస్‌బుక్‌లో పరిచయమైన రవిదాస్‌ అనే వ్యక్తితో పరారయ్యింది. విషయం తెలుసుకున్న భర్త కంగుతిన్నాడు.   

Also Read: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

జరిగిన విషయం అంతా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు సాయంతో వాళ్లిద్దరూ ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. కానీ ఆమె తన భర్తతో మాట్లాడడానికి నిరాకరించింది. విడాకులు ఇస్తానంటూ హెచ్చరించింది. భార్య మాటలు నమ్మి.. కిడ్నీ విక్రయించి మోసపోయానని బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.  

Also Read: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. యువతి కళ్లు పీకేసి, కాలు విరగొట్టి కిరాతకంగా..

Also Read: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు