కెనడా రాజకీయాల్లో ప్రధాని ట్రూడో రాజీనామా ప్రకటనతో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవిలో ఉంటానని ఆయన వెల్లడించారు.
Also Read: America: భీకర మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!
అయితే ఆయన తరువాత ప్రధాని పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా తెరమీదకి కొన్ని పేర్లు వినపడుతున్నాయి.వారిలో భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ ఒకరు.ఆమె తమిళ్, పంజాబీ మూలాలు కలిగిన నేత. ఆమె తండ్రిది తమిళనాడు కాగా, తల్లిది పంజాబ్. 57 ఏళ్ల అనిత ఆనంద్ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యను అభ్యసించారు.
Also Read: Garikipati అలాంటోడా... సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య
2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమె ట్రూడో కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. పబ్లిక్ సర్వీసెస్, రవాణా, రక్షణ సహా పలు కీలక పదవులను నిర్వహించారు.
కాగా, సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ట్రూడో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను రాజీనామా చేస్తానని, ఈ విషయం గురించి తన పార్టీకి, గవర్నర్‌కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
‘నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నానని ట్రూడో అన్నారు.ల కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.
Also Read: Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?
Also Read: America: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ.. అమెరికాలో తొలి మరణం