/rtv/media/media_files/2026/01/28/sambhavi-2026-01-28-16-32-25.jpg)
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం కావడంతో అతనితో పాటు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బారామతి వెళ్తుండగా.. అక్కడ ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. విమానంలో ఉన్న పైలట్, సిబ్బంది కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
పైలెట్లు ఇద్దరూ చాలా అనుభవజ్ఞులు..
ఈ విమానానికి కెప్టెన్ శాంభవి పాఠక్ పైలెట్ ఇన్ కమాండర్ గా పిన చేస్తున్నారు. ఈమె రక్షణ నేపథ్యం నుంచి వచ్చారు. ఆర్మీ అధికారి కుమార్తె. ఎయిర్ఫోర్స్ లోనే శాంభవి చిన్నప్పటి నుంచి చదువుకున్నారని తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ బాల భారతి పాఠశాలలో శాంభవి స్కూల్ స్టడీస్ పూర్తి కాగా...ఆ తర్వాత ఆమె విమానయానానికి సంబంధించి ఉన్నత విద్యను అభ్యసించారు. శాంభవి ముంబై విశ్వవిద్యాలయం నుండి ఏరోనాటిక్స్, ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందింది. ఆ తరువాత న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో ప్రొఫెషనల్ పైలట్ శిక్షణ పొందింది. వీటన్నింటితో పాటూ శాంభవి..ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ మీ పీహెచ్‌డీ కూడా చేశారని తెలుస్తోంది. ఆమెకు విమానం నడపడంలో అత్యంత అనుభవం ఉందని ఎయిర్పోర్స్ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆమె మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్‌లో అసిస్టెంట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పనిచేసింది, అక్కడ ఆమెకు ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ రేటింగ్ (A) ఉంది. కెప్టెన్ శాంభవి..బహుళ విమానయాన లైసెన్స్‌లు మరియు ధృవపత్రాలను కలిగి ఉన్నారు. వీటిలో మే 2020లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్, నవంబర్ 2019లో న్యూజిలాండ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుండి జారీ చేయబడిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నాయి.
అలాగే శాంభవితో పాటూ ఉన్న మరో ఫైలెట్ ఇన్ కమాండర్ సుమిత్ కపూర్ కూడా అత్యంత అనుభవజ్ఞులని తెలుస్తోంది. ఇతనికి 16 వేలకు పైగా ఫ్లైట్ ను నడిపిన అనుభవం ఉంది అలాగే టేకాఫ్, ల్యాండింగ్ తో సహా క్లిష్టమైన దశలలో విమానాన్ని నడిపే సామర్థ్యం పూర్తిగా ఉందని చెబుతున్నారు.
ల్యాండింగ్ లో విజిబులిటీ లేదు..
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంలో పైలెట్ల తప్పు లేదని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఎయిర్ పోర్ట్ లో విజిబులిటీ తక్కువ ఉన్న కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వేను గుర్తించడంలో పైలెట్లు ఇబ్బందులు ఎదుర్కున్నారని తెలిపారు. మేడే కాల్ రాకుండానే ఫ్లైట్ యాక్సిడెంట్ కు గురైందని చెప్పారు.
పైలెట్లలో ఒకరైన కెప్టెన్ శాంభవి చాలా మంచి పైలెట్ అని చెబుతున్నారు. కెప్టెన్ సుమిత్ కపూర్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. చాలా అనుభవశాలి. ఆయన కొడుకు కూడా పైలట్. అలాగే కెప్టెన్ శాంభవి నాకు నా బిడ్డ లాంటిదని..VSR ఏవియేషన్ సీనియర్ అధికారి VK సింగ్ తెలిపారు. ఇద్దరూ చాలా మంచి పెలెట్లని చెప్పారు. కెప్టెన్ సుమిత్ కు విమానం నడపడంలో అనుభవం ఎక్కువే ఉందని అన్నారు. మరోవైపు కెప్టెన్ శాంభవి గురించి కూడా సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. సుధీర్ అనే అతను శాంభవి తన కూతురు లాంటిదని చెప్పుకొచ్చారు. ఆమె తన కూతురు స్నేహితురాలని...చాలా తెలివైన విద్యార్థి అని కొనియాడారు.
Follow Us