USA: ట్రంప్‌కు అగ్ని పరీక్ష.. అమెరికాలో మళ్లీ ఎన్నికలు

అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్‌ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది.

New Update
US Midterm Elections

US Midterm Elections

అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్‌ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ గత రెండేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్‌లు పెంచడం లాంటి నిర్ణయాలు దుమారం రేపాయి. అయితే ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గతేడాది అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేశారు. మరీ ఈ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేస్తారా ? లేదా ? అనేది ఆసక్తిగా మారింది. 

మధ్యంతర ఎన్నికలు అంటే ?

అమెరికాలో అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. కానీ ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. వీటినే 'మిడ్‌టర్మ్ ఎలక్షన్స్' అని అంటారు. అమెరికా పార్లమెంటునే కాంగ్రెస్‌ అంటారు. ఈ కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ. ఇందులో హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలు ఉంటాయి. హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరగుతాయి. 

Also Read: అజిత్ పవార్ ప్రమాదానికి గురైన విమానం.. మళ్లీ 2023 సీన్ రిపీట్

ఇక రెండవది ఎగువ సభ. ఇందులో ఉండేవాళ్లని సెనేటర్లు అని పిలుస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు. సెనేటర్ల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు అంటే 33-35 మంది సెనేటర్లు మారుతుంటారు. ఏ ఒక్క ఎన్నికల్లో సమయంలో సెనేట్ మొత్తం ఖాళీ అవ్వదు. కాబట్టి ఈ మధ్యంతర ఎన్నికల్లో 33 నుంచి 35 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

ఈ మధ్యంతర ఎన్నికల్లో గవర్నర్లను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. అమెరికాలో 48 రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవీ కాలం నాలుగేళ్లు ఉంటుంది. మిగిలిన రెండు రాష్ట్రాలైన న్యూ హాంప్‌షైర్, వెర్మోంట్‌లో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. గవర్నర్ల పదవీ కాలం అధ్యక్షుడి పదవీకాలంతో సమానంగా ఉన్నప్పటికీ.. మెజారిటీ రాష్ట్రాల్లోని ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలు లేని సమయంలో  అంటే మధ్యంతర ఎన్నికలప్పుడే ఎన్నికలు జరుగుతాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు, గవర్లర్లే కాకుండా తమ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థానిక అధికారులను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. అంటే స్టేట్ లెజిస్లేటర్లు, అటార్నీ జనరల్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, మేయర్లు, స్కూల్ బోర్డు సభ్యులను ఎన్నుకుంటారు. 

Also Read: 18 ఏళ్ల తర్వాత భారత్ EU ఒప్పందం.. భారత్‌కు ప్రయోజనం ఉందా?

ట్రంప్‌కు ముప్పు ఉందా ? 

అమెరికాలో ప్రతీసారి అధికారంలో ఉన్న పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సీట్లను కోల్పోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ట్రంప్ పాలనకు కూడా పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ద్రవ్యోల్బణం, ఇమ్మిగ్రేషన్ పాలసీలు, సామూహిక బహిష్కరణలు, విదేశాలపై టారిఫ్‌లు పెంచడం లాంటి అంశాలు అమెరికన్లలో అసంతృప్తిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీకి రెండు సభల్లో మెజార్టీ సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లకు ఎక్కువ సీట్లు వస్తే రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ తగ్గుతుంది. దీంతో ట్రంప్‌ ప్రవేశపెట్టే బిలుల్లు, బడ్జెట్ ఆగిపోతాయి. మొత్తంగా ట్రంప్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతుంది. మరీ ఈ ఎన్నికల్లో అమెరికన్ ప్రజలు ట్రంప్‌కు మద్దతిస్తారా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు