Work Hours: చైనాలో 996 పని సంస్కృతి బ్యాన్..కానీ దాన్నే ప్రామాణికంగా చూపిస్తున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి..

72 పనిగంటల వివాదంపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. తాజాగా దీనిని సమర్ధించకోవడానికి ఆయన చైనా 996 పని సంస్కృతిని ఒక ప్రమాణంగా ఎత్తి చూపారు. ఇప్పుడు ఇది తీవ్ర విదానికి కారణం అవుతోంది.

New Update
murthy

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలపై టెక్ ఉద్యోగలు పాటూ అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. 72 పని గంటల విధానం గురించి చెప్పినప్పుడు అందరూ ఆయనపై మండిపడ్డారు. మనుషులు అనుకుంటున్నారా, యంత్రాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారతీయ యువత ఇతర అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా వారంలో 70 గంటలు పనిచేయాలని చెప్పగా.. పలు కంపెనీల అధినేతలు సహా అందరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.  ఉద్యోగులు మాత్రం మూర్తి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు నారాయణ మూర్తి. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవాలంటే.. యువత నిరంతరం శ్రమించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.దానికి తోడు ఇప్పుడు ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి చైనా 996 పని గంటల విధానాన్ని ఒక ప్రమాణంగా చూపారు. దాంతో ఆయన మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. నారాయణ మూర్తి మూర్తి 996 ను క్రమశిక్షణకు చిహ్నంగా చెప్పనప్పటికీ.. చైనా అనుభవం, ఒక దేశం తన శ్రామిక శక్తిని ఎంతవరకు విస్తరించగలదో .. చివరికి పరిమితులు ఎక్కడ తొలగిపోతాయో బహిర్గతం చేసే కేస్ స్టడీగా ఇది పనిచేస్తుంది.

అసలేంటీ 996..

చైనాలో ఒకప్పుడు 996 అమల్లో ఉండేది. అంటే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పని చేయాలి. ఒకప్పుడు చైనాలో సాంకేతిక అభివృద్ధి పెంపొందించేందుకు దీన్ని అమలు చేశారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ఇంటర్నెట్, స్టార్టప్‌లలో అధిక వృద్ధి చెందుతున్న కంపెనీలలో ఈ అభ్యాసం ప్రాచుర్యం పొందింది. అయితే తర్వాత దాన్ని అక్కడ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2021లో చైనా అత్యున్నత న్యాయస్థానం ఈ 996 పని విధానాన్ని చట్ట విరుద్ధమని, వెంటనే ఆపేయాలని తీర్పునిచ్చింది. దీంతో అప్పటి నుంచి 996 చైనాలో రద్దు చేశారు. అయితే ఈ విధానం కారణంగా అలీబాబా, టెన్సెంట్, JD.com వంటి టెక్ దిగ్గజాలు, లెక్కలేనన్ని అధిక-వృద్ధి స్టార్టప్‌లు ప్రపంచంలో మరే ఇతర సంస్థకూ లేనంత వేగంతో వృద్ధి చెందాయి. అయితే 2021 తర్వాత దీనిపై చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ప్రారంభ వేగం ఉన్నప్పటికీ, 996 సహజంగానే నిలకడగా లేదు. కాలక్రమేణా, తీవ్రమైన ఒత్తిడి ఇబ్బందికరమైన మార్గాల్లో బయటపడటం ప్రారంభమైంది. ఉద్యోగులు నిద్ర లేమి, మానసిక ఆరోగ్యం క్షీణించడం, పని-జీవిత సరిహద్దుల విచ్ఛిన్నం గురించి బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ-కామర్స్ కంపెనీ పింగ్డుడువోలో 22 ఏళ్ల మహిళా ఉద్యోగి అర్ధరాత్రి తర్వాత పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కుప్పకూలి మరణించారు కూడా. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆగస్టు 2021లో చైనా సుప్రీం పీపుల్స్ కోర్ట్, మానవ వనరులు, సామాజిక భద్రతా మంత్రిత్వ శాఖతో కలిసి, 996 కార్మిక చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించేదిగా బహిరంగ ప్రకటన విడుదల చేయడంతో ఇది పరాకాష్టకు చేరుకుంది. ఆ తరువాత అత్యున్నత న్యాయస్థాన ప్రకటనతో 996ను ఆపేశారు.

ఇప్పుడు నారాయణ మూర్తి అదే విధానాన్ని పొగడడమే కాక..దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం చాలా పెద్ద చర్చకే దారి తీసింది. మన దేశంలో ప్రొడక్టివిటీ పెరగాలని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ 6.57 శాతం వృద్ధి రేటు కనబరుస్తున్నప్పటికీ.. దీని కంటే 6 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాతో పోటీపడాలంటే.. యువత మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. యువత ముందు కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి సారించాలని.. ఆ తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించాలని సూచించారు.  మరోవైపు చైనాలో కూడా ఈ 996 పూర్తి తొలిగిపోలేదు. 996 తాలూకా అత్యంత తీవ్రమైన వెర్షన్ అధికారిక అనుమతిని కోల్పోయినప్పటికీ.. పోటీ, ఆర్థిక అనిశ్చితి, కంపెనీ-నిర్దిష్ట ఒత్తిళ్ల ద్వారా రూపొందించబడిన అధిక పని సంస్కృతి లాంటి అంశాలు మాత్రం చైనాలో ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం కూడా అలాగే తయారవ్వాలని అంటున్నారు.

Also Read: Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం..నిర్మాణ పూర్తికి చిహ్నంగా జెండా ఆవిష్కరణ

Advertisment
తాజా కథనాలు