/rtv/media/media_files/2025/11/25/ayodhya-2025-11-25-08-06-11.jpg)
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో పవిత్ర ఘట్టానికి వేళయింది. ఈరోజు ప్రధానిమోదీ రామమందిరం ధ్వజారోహణం చేయను్నారు. అంతేకాదు దనిపై జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తికి చిహ్నంగా దీనిని నిర్వహించనున్నారు. ఇదొక చారిత్రిక మైలురాయని అభివర్ణిస్తున్నారు. ఈ చారిత్రక వేడుక కోసం అయోధ్య నగరం పండుగ శోభను సంతరించుకుంది. రోడ్ల శుభ్రత, కొత్త సైన్ బోర్డుల ఏర్పాటు, విస్తృతమైన పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. అమెధ్య అంతటా మోదీ పోస్టర్లు వెలిసాయి.
2020లో మొదలు..2025 నవంబర్ లో పూర్తి..
అయోధ్య రామాలయంలో పీఎం మోదీ ఈ రోజు కాషాయ జెండా ఎగురవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్ ను ఆవిష్కరించనున్నారు. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు, ఓం ఉండనున్నాయి. రామ మందిరానికి 2020 ఆగస్టు5న భూమిపూజ, 2024 జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈరోజు ధ్వజారోహణ ఉత్సవం నేపథ్యంలో ఫ్లాగ్ ను ఎగురవేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం మొత్తం విద్యతు్ దీపాలతో అలంకరించారు. రామమందిరం ప్రవేశ ద్వారం వద్ద "జాతి పతి పూచే నహీ కోయ్, హరి కా భజే సో హరి కా హోయ్ అనే వాసనాన్ని కూడా రాయించారు. అయోధ్య ఆలయ ప్రాంగణంతోపాటు నగరం మొత్తం సుమారు 100 టన్నుల పూలతో అలంకరించారు. ప్రధాన ఆలయం బాలరాముడి ఆలయంతో పాటు.. అనుబంధ ఆలయాలైన లార్డ్ మహాదేవ్, లార్డ్ గణేశ్, లార్డ్ హనుమాన్, సూర్యదేవ్, మా భగవతి, మా అన్నపూర్ణ, శేషావతార్ ఆలయాలను కూడా భారీ స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు.
మరోసారి ప్రధాని మోదీ..
ప్రధాని ఎగుర వేయనున్న జెండాపై సూర్యుడు..రాముడికి సంబంధించిన అనంత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానాన్ని సూచిస్తుంది. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో.. అయోధ్య, కాశీ, దక్షిణాది నుంచి వచ్చిన 108 మంది ఆచార్యులు ఈ ఆధ్యాత్మిక క్రతువును నిర్వహిస్తారు. 2024 జనవరి 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరోసారి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి సాధువులు, ప్రముఖులు, ట్రస్ట్ సభ్యులతో సహా సుమారు 6 వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లును చేశారు. అడుగడుగా సీసీ టీవీకెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ నిరంతర పర్యవేక్షణ చేపట్టింది.
Also Read: China-Taiwan: తైవాన్ చైనాలో భాగమే..ట్రంప్ కు కన్ఫార్మ్ చేసిన జిన్ పింగ్
Follow Us