Accident: ఔటర్ రింగు రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. చెక్రాల కింద నలిగిన ప్రయాణికులు!
నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా కొట్టింది. ఇద్దరు ప్రయాణికులు బస్సు చెక్రాల కింద నలిగిపోయారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.