/rtv/media/media_files/2025/11/01/villagers-return-to-abandoned-himalayan-homes-after-63-years-2025-11-01-21-19-30.jpg)
Villagers return to abandoned Himalayan homes after 63 years
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పలు ప్రాంతాల్లో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇందులో ఫీథోర్‌గఢ్ జోహార్ లోయలో ఉన్న మిలం అనే గ్రామం కూడా ఒకటి ఉంది. అప్పటినుంచి ఆ ఊరిలో ఎవరూ లేరు. 63 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ గ్రామానికి జనాలు తరలివస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ పల్లెను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. 1962 తర్వాత ఇటీవలే అక్కడ ఓ నూతన భవనాన్ని నిర్మించారు.
Also Read: ఆధార్ కార్డు ప్రియులకు గుడ్‌న్యూస్.. నేటి నుండి ఈ కొత్త రూల్స్
పర్యాటకుల కోసం దాన్ని హోమ్‌స్టేగా మార్చేశారు. అంతేకాదు పలు పాత ఇళ్లకు కూడా మరమ్మతులు చేశారు. రోడ్లు, కమ్యూనికేషన్ సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. సమీపంలో ఉన్న 12 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కోసం రూ.20 కోట్ల వ్యయంతో ఓ ప్రాజెక్టుకు కూడా అనుమతి వచ్చింది. అక్కడ మిలంతో పాటు హిమానీనదం, నందా దేవి ఆలయం, ట్రెక్కింగ్ అనేవి పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. 2024లో ఇక్కడ పర్యాటకుల సంఖ్య కేవలం 1280 మాత్రమే ఉంది.
Also Read: ప్రశాంత్ కిషోర్‌కు బిగ్ షాక్.. బిహార్ ఎన్నికల్లో గెలిచేది వాళ్లే.. సర్వేలో సంచలన విషయాలు
ఈ ఏడాది 3200కు పెరిగింది. అయితే భారత్-చైనా యుద్ధానికి ముందు మిలం గ్రామంలో 500 కుటుంబాలు ఉండేవి. యుద్ధం సమయంలో ఆ కుటుంబాలన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తాజాగా అక్కడ పునరావాసం కల్పించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుండటంతో మళ్లీ జనాలతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది.
Also Read: 2025లో జరిగిన తొక్కిసలాట ఘటనలు.. 100 మందికి పైగా బలి
Follow Us