Bihar Elections: ప్రశాంత్‌ కిషోర్‌కు బిగ్ షాక్.. బిహార్ ఎన్నికల్లో గెలిచేది వాళ్లే.. సర్వేలో సంచలన విషయాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై తాజాగా JVC అనే సంస్థ పోల్ సర్వే నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో NDA కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

New Update
Prashanth Kishor, Nitish Kumar and Tejaswi yadav

Prashanth Kishor, Nitish Kumar and Tejaswi yadav

మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌ సూరాజ్ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా JVC అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో NDA కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో బీజేపీ 70, జేడీయూ 42-48, ఎల్‌జేపీ (ఆర్‌వీ) 5-7, హెచ్‌ఏఎం(ఎస్) 2, ఆర్‌ఎల్‌ఎం 1-2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. 

Also Read: అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ

JVC Poll Released Survey Details

మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో ఆర్జేడీ 69-78, కాంగ్రెస్ 9-17, సీపీఐ(ఎంఎల్) 12-14, సీపీఐ 1, సీపీఐ(ఎం) 1-2 వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌ సూరాజ్‌ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలుస్తుందని తెలిపింది. AIMIM, BSP, ఇతరులు 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తన సర్వేలో పేర్కొంది. ఇటీవల లోక్‌పోల్‌ కూడా తమ సర్వే వివరాలు బయటపెట్టింది. NDA  105 -114 seats, మహాగఠ్‌ బంధన్ కూటమి 118-126, ఇతరులు 2-5 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 

Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్

ఇదిలాఉండగా బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష కూటములు తమ మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఎన్డీయే కూటమి తాము అధికారంలోకి వస్తే యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు మహాగఠ్‌బంధన్ కూటమి తాము గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములు యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాయి. అలాగే ఇతర స్కీమ్‌లు కూడా ప్రకటించాయి. మరీ ఈసారి బీహార్‌ ప్రజలు ఎవరికి అధికార పీఠం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.  

Advertisment
తాజా కథనాలు