/rtv/media/media_files/2025/05/10/KQFHFQ4rD4KtruFJfBcV.jpg)
India- Pakistan Agreed to Ceasefire
India-Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై భారత్ కూడా స్పందించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
Also Read: భారత్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి ఉగ్రదాడి జరిగితే ..?
Big Breaking:భారత్-పాకిస్థాన్ మధ్య ఆగిన యుద్ధం..
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.#VikramMisri #IndiaPakisthanWar #OperationSindoor #RTV pic.twitter.com/yhK5TZb7Ou
Also Read: పాక్ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
కాల్పుల విరమణ
అయితే శనివారం మధ్యాహ్నం 3:35 PM గంటలకు పాకిస్తాన్ డీజీఎంఓ.. భారత డీజీఎంఓతో మాట్లాడారని విక్రమ్ మిస్రీ తెలిపారు. మే 12న మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు మళ్ళీ మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. ఇరుదేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకారం తెలపడాన్ని నెటిజన్లు కూడా స్వాగతిస్తున్నారు.