Ex-gratia : పాక్‌ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

New Update
ex-gratia

ex-gratia

పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న భారత సాయుధ దళాలు ఉగ్రస్థావరాలను భారత్‌ ధ్వంసం చేయడంతో పాక్‌ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. 

గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ తో సహా 19 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా, శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

చాలా బాధ కలిగించింది

"ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. మా ప్రభుత్వం మా ప్రజల కష్టాలను తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది" అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా  ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం షేర్ చేసిన పోస్ట్‌లో చనిపోయిన వ్యక్తిని భర్తీ చేయలేము లేదా కుటుంబానికి కలిగిన గాయాన్ని నయం చేయలేము. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా పరిహారం అందిస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో ప్రతి బాధిత కుటుంబంతో మేము నిలబడతాము" అని ట్వీట్ చేశారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు