/rtv/media/media_files/2025/06/25/vandhe-bharath-2025-06-25-06-45-52.jpg)
వందేభారత్‌లో వర్షం.. వీరు చదివింది నిజమే భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీ నడిచే వందే భారత్ రైలులోని సీ7 కోచ్‌లో ప్రయాణించిన వారికి చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణ సమయంలో హఠాత్తుగా పైకప్పు నుంచి నీళ్లు కారడం ప్రారంభం కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్యాసింజర్ల వస్తువులు అన్నీ తడిచిపోయాయి. దాదాపు 8 గంటల పాటు ట్రైన్ పైకప్పు నుంచి నీరు కారుతూనే ఉంది. సమస్యను రైల్వే భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళితే అతడు సర్దుకుపొమ్మని చెప్పాడట.
High-speed, low standards? Leaky Vande Bharat train roof leaves student drenched during 8-hour journey; staff say ‘adjust kariye’
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 24, 2025
https://t.co/uxUMbx2MJRpic.twitter.com/gaaSVfcWmB
టికెట్ ఎగ్జామినర్ ప్రయాణ సమయంలో తమ కోచ్‌కు రానే రాలేదని ప్రయాణీకులు చెబుతున్నారు. తనకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని వినియోగదారుల ఫోరంలో ఓ ప్రయాణీకులు దర్శిల్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే సేవ ఎక్స్‌లో స్పందించింది. ఏసీలోని నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఎయిర్ ఫిల్టర్ వద్ద రంధ్రాలు బ్లాక్ కావడం వల్ల కూలింగ్ కాయిల్ వద్ద నీరు పేరుకుపోయి, ఎయిర్ డక్ట్‌లోకి తిరిగి ప్రవేశించడం వల్ల ప్రయాణికులుండే ప్రాంతంలో నీళ్లు కారాయని తెలిపింది. రైలు తిరుగు ప్రయాణ సమయానికి సమస్యను పరిష్కరించామని చెప్పింది.