Vice President: రాష్ట్రపతికి కోర్టు డెడ్ లైన్ విధించడమేంటి..ఉపరాష్ట్రపతి

బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువుపై ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సూపర్ పాలర్మెంట్ గా వ్యవహరించే అధికాం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రపతికి కోర్టు గడువు పెట్టడమేంటన్నారు.

New Update
ind

Vice President Jagdeep Dhankar

మన దేశం ఎటు వెళుతోందని ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ అన్నారు. దేశంలో ఏం జరుగుతోంది..రాష్ట్రపతికి కోర్టు గడువు విధించడమేంటని ఆయన ప్రశ్నించారు. బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువును నిర్ణయించడానికి సుప్రీంకోర్టు ఎవరని దన్ ఖడ్ అడిగారు. జడ్జిలు చట్టాలు రూపొందించి అమలు చేసే పరిస్థితి, సుప్రీంకోర్టు సుూపర్ పార్లమెంట్ గా వ్యవహరించే అధికారం మన రాజ్యాంగంలో లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతికి ఏ ప్రాతిపదికను సూచనలు ఇచ్చారని ధన్ ఖడ్ అడిగారు. న్యాయవ్యవస్థ ఈ అతిక్రమణ ఎంత మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. దీంతో పాటూ జస్టిస్ వర్మ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన విషయం గురించి ఆయన ప్రశ్నించారు. ఇది జరిగి ఏడు రోజులు అవుతున్నా దీనిపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ఉపరాష్ట్రపతి ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం చట్ట పాలనను నిర్వచిస్తుందని ఆయన అన్నారు. ముందు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని...ఆ తరువాత రాష్ట్రపతికి గడువులు ఇవ్వొచ్చని తీవ్రంగా విమర్శించారు. 

బిల్లుల విషయంలో సుప్రీం సంచలన తీర్పు..

నాలుగు రోజుల క్రితం రాష్ట్రపతికి సంబంధించిన వ్యవహారాల్లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు కలుగజేసుకుంది. రాష్ట్రపతికి గవన్నర్ పంపే బిల్లులపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ తో పాటూ రాష్ట్రపతికీ గడువు విధించింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది. దాంతో పాటూ ఇకర మీదట ఇలాంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని మరీ చెప్పింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ ధర్మాసనం తేల్చి చెప్పింది.

today-latest-news-in-telugu | vice-president | jagdeep-dhankhar | supreme-court

Also Read: IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై

Advertisment
Advertisment
తాజా కథనాలు