IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై

కాశ్మీర్ తమ జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విదేశీ భూభాగం మీకు జీవనాడి ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది. ఆక్రమించిన భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయండి అంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
national

Ind-Pak

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్‌ మునీర్‌ కాశ్మీర్ పై వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం విషయంలో తాము ముందు నుంచీ కూడా సరైన పద్ధతిలోనే వ్యవహరిస్తున్నామని చెప్పారు. అది పాక్ జీవనాడి...దానిని ఎప్పటికీ వదులుకోలేమని అన్నారు. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ అన్నారు. భారత్ లో ఉన్న కాశ్మీర్ ను తమ జీవనాడి అని ఎలా అంటారని ప్రశ్నించారు. కాశ్మీర్ ను అక్రమించడమే ఒక తప్పు అంటే మళ్ళీ అది మాది అంటూ మాట్లాడ్డం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఒక కాశ్మీర్ ను ఖాళీ చేసి వెళ్ళే సమయం వచ్చిందని అన్నారు. ఇలా పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని రణధీర్ అన్నారు. కాశ్మీర్ విషయంలో భారత్ ఎప్పటికీ తగ్గేది లేదని..తమ వైఖరిని మరింత బలంగా వినిపిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్‌ ఆక్రమణలోనే ఉంది. దాన్ని ఖాళీ చేయాల్సిందే’’ అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌  హితవు పలికారు.

వివాదం సృష్టించిన ఆర్మీ ఛీఫ్ మాటలు..

అసిమ్‌ మనీర్‌ భారత్, కశ్మీర్‌ వివాదంపై కూడా మాట్లాడారు. పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ను ఏ శక్తి కూడా విడదీయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు కశ్మీర్‌లో అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని చెప్పింది. ఇలాంటి తరుణంలో అసిమ్‌ మనీర్‌ భారత్‌, పాకిస్థాన్‌కు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం  సంతరించుకుంది. అంతేకాదు బలోచిస్థాన్‌లో తీవ్రవాదన్ని అంతం చేస్తామని కూడా అసిమ్ మనీర్‌ ప్రతీక్ష చేశారు. రాబోయే పది తరాల వాళ్లు కూడా బలోచిస్థాన్‌, పాకిస్థాన్‌పై దాడులు చేయలేరంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పాకిస్తాన్‌లో ప్రస్తుతం అశాంతి నెలకొంది. పలుచోట్ల బాంబు దాడులు జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల గుర్తు తెలియని ముష్కరుల భయం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతోంది. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ , ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్  BLA కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పాకిస్తాన్‌లో భద్రతపై ఆందోళన నెలకొంది. 

today-latest-news-in-telugu | india | pakistan | kashmir

Also Read: TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు