ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల నుంచే తమ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కానుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(Uniform Civil Code)ను పాస్ చేసింది. అంతేకాదు ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చింది. ఆ తర్వాత మార్చి 12న 2024లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి! ఆ తర్వాత ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని రూపొందించారు. 2025 జనవరి నుంచి ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చెందారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని గతంలోనే సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దేశంలో అందరికీ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయడాన్నే ఉమ్మడి పౌరస్మృతి అని అంటారు. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే ఈ యూనిఫాం సివిల్ కోడ్ ఉద్దేశం. ప్రస్తుతం చూసుకుంటే పెళ్లిల్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి చట్టాలు అందరికీ ఒకేలా ఉండటం లేదు. పౌరులు ఆచరించే మతం, వారి విశ్వాసాల ఆధారంగానే ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. Also Read: గూగుల్ మ్యాప్స్ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు అయితే ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మతాలతో సంబంధం లేకుండా, లింగ భేదం లేకుండా భారత పౌరులందరికీ యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా ఒకే చట్టాన్ని వర్తింపజేయచ్చు. కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు యత్నిస్తోంది. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ముందడుగులు పడలేదు. అయితే మొదటిసారిగా ఉమ్మడిపౌర స్మృతిని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ సీఎం చెప్పడం గమనార్హం.