/rtv/media/media_files/2025/02/24/fYX9EdCdZuUkixfu2WWg.jpg)
Marriage
ఉత్తరప్రదేశ్‌లోని హసన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ మహిళ గేదెల కోసం ఏకంగా రెండోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయి పెళ్లి మండపానికి వచ్చింది. మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా ఆమె అత్తమామలు వచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హసన్‌పూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 300 జంటలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి పీటలపై కూడా కూర్చున్నారు.
Also Read: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?
అక్కడ పెళ్లి చేసుకోబోతున్న వధువుల్లో అస్మా అనే మహిళకు చెందిన అత్తమామలు పెళ్లి మండపం వద్దకు వచ్చారు. అస్మాకు ఇంతకుముందే పెళ్లి అయిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో గేదెలు అమ్మేందుకే ఆమె రెండో పెళ్లి చేసుకుంటోందని తెలుసుకుని అక్కడున్న అధికారులు షాకైపోయారు. ఆమె అత్తింటి వారు చెప్పిన ప్రకారం.. మూడేళ్ల క్రితమే అస్మాకు మహమ్మద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వాళ్ల మధ్య తరచుగా గొడవలు వస్తుండేవి. దీంతో ఆస్మా ఆరు నెలల క్రితమే తన పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా యోగీ ప్రభుత్వం సామూహిక పెళ్లిళ్లు చేస్తోందని.. ఇందులో వివాహం చేసుకున్న జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం, ఇతర గిఫ్టులు ఇస్తున్నట్లు ఆమె తెలుసుకుంది.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ఈ క్రమంలోనే అస్మాకు ఓ ఆలోచన వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వివాహాల్లో తన బంధువు జబేర్ అహ్మద్‌ను రెండో పెళ్లి చేసుకొని అందులో వచ్చే డబ్బును ఇద్దరం పంచుకుందామని ప్లాన్ వేసింది. ఆ డబ్బుతో వాళ్లిద్దరూ చెరో గేదెను కొనుక్కోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం సామూహిక పెళ్లి పథకానికి దరఖాస్తు చేశారు. చివరికీ ఈ విషయం తెలుసుకున్న అస్మా అత్తమామలు.. వివాహం జరిగే రోజున పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. ఆమె పెళ్లిని ఆపేశారు. సామూహిక వివాహాల రూల్స్‌ను ఉల్లంఘించి, తమ సొంత ప్రయోజనం కోసం ఇలా పెళ్లికి సిద్ధమైనందుకు అస్మా, జబేర్ అహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.