/rtv/media/media_files/2026/01/06/uttar-pradesh-sir-voter-list-2026-01-06-12-16-40.jpg)
Uttar Pradesh SIR Voter List
కేంద్ర ప్రభుత్వం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (SIR) పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియతో కోట్లాది ఓట్లను తొలగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సర్‌పై ముసాయిదా జాబితా వెల్లడైంది. దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. చిరునామాలో మార్పులు, చనిపోవడం, వలస వెళ్లడం, ఒకే వ్యక్తితో పలుచోట్ల ఓటరు పేరు నమోదవ్వడం లాంటి కారణాల వల్ల ఓటర్ల పేర్లు తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక
తొలగించబడిన ఓటర్లు ఫిబ్రవరి 6 వరకు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సర్ ప్రక్రియ వల్ల యూపీలోని ఓటర్లలో దాదాపు18.7 శాతం ఓట్లను జాబితా నుంచి తొలగించారు. ఇంత భారీ మొత్తంలో తొలగింపులపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముస్లింలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని తొలగిస్తున్నట్లు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Also Read: మదురోకు నమ్ముకున్న వాళ్లే ద్రోహం.. సాయం చేయలేని చైనా, రష్యా, ఇరాన్
గత ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచిన నియోజకవర్గాల్లోనే ఒక్కో ప్రాంతంలో ఏకంగా 50 వేల ఓట్లను తొలగించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు విమర్శించారు. మరోవైపు అర్హులైన ఓటర్లు నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Follow Us