/rtv/media/media_files/2026/01/06/nicolas-maduro-2026-01-06-11-50-44.jpg)
Nicolas Maduro
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మదురోకు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వెనెజువెలా నమ్ముకున్న దేశాలే అత్యవసర పరిస్థిల్లో సాయం చేయలేకపోయాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 2 -3 వ తేదీ మధ్య రాత్రికి వెనెజువెలాలో అమెరికా సైనిక చర్య ప్రారంభించడానికి కొద్దిసేపటి ముందుగానే చైనా అధికారులు మదురో దంపతులను కలిశారు.
మదురోకు ఇలాంటి దుస్థితి రావడానికి గల కారణం చైనానే అంటూ ఓ ప్రచారం నడుస్తోంది. అమెరికా, చైనా మధ్య బ్యాక్‌డోర్ ఒప్పందం జరిగిందని దీని ద్వారా మదురో స్థానంలో అమెరికాకు అనుకూలంగా ఉండేవారు చేరుతారనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చైనానే స్వయంగా మదురో ఎక్కడున్నారో అమెరికాకు చెప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలాఉండగా ట్రంప్ నికోసలస్‌పై రూ.451 కోట్ల బహుమతిని కూడా ప్రకటించారు. దీంతో మదురో ఎప్పుడూ ఒకే చోట ఉండలేదు. కనీసం రెండ్రోజుల కన్నా ఎక్కువగా ఒక చోట ఉండలేదని తెలుస్తోంది. అయినప్పటికీ అమెరికా ఆయనపై పెద్దఎత్తున గూఢచర్య ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకుంది.
Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక
నికోలస్ మదురో ట్రంప్‌కు తలొగ్గడం లేదు. దీనికి కారణం ఆయనకు రష్యాపై నమ్మకం ఉంది. అమెరికా వెనిజువెలాపై సైనిక చర్య తీసుకుంటే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ తనని కాపాడుతందని భావించారు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం వెనెజువెలా వద్ద నాలుగు రష్యన్ క్షిపణి డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కారకాస్ ఎయిర్‌బేస్‌లో ఉన్న రష్యన్ వైమానిక రక్షణ వ్యవస్థను అమెరికా ఫైటర్ జెట్ ధ్వంసం చేసింది. కానీ ఆ రక్షణ వ్యవస్థ ఈ దాడులను ఆపలేకపోయాయి. దీంతో రష్యా నుంచి తీసుకున్న రక్షణ వ్యస్థతో వెనెజువెలా పెద్ద దెబ్బే పడింది.
Also Read: బంగ్లాదేశ్‌లో దారుణం.. 24 గంటల్లోనే ఇద్దరు హిందువులు హత్య
మరోవైపు ఇరాన్ వెనెజువెలాకు శత్రు కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు డ్రోన్లు అందించింది. కానీ ఈ డ్రోన్లు కూడా అమెరికా సైనిక చర్యకు ముందు ఫలితాలు ఇవ్వలేదు. చివరికీ అమెరికా తమ ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అమెరికాకు సపోర్ట్‌గా ఇజ్రాయెల్, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, అర్జెంటీనా, అల్బేనియా, పేరు లాంటి దేశాలు ఉన్నాయి. కానీ వెనుజవెలాకు మాత్రం రష్యా, చైనా, ఇరాన్, క్యూబా, మెక్సికో, బ్రెజిల్, బెలారస్, ఉరుగ్వే, కొలంబియా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మదురో ఎక్కువ నమ్మే తన సెక్యూరిటీ గార్డు కూడా ఆయన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇతడు మదురో గురించి సమాచారాన్ని CIA ఏజెంట్లకు పంపించినట్లు సమాచారం.
Follow Us