/rtv/media/media_files/2025/11/10/cough-2025-11-10-15-32-26.jpg)
Upgrade by Jan 1 or shut shop, Drugmakers put on notice after cough syrup deaths
ఇటీవల కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందడం ఆందోళన రేపింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది. అన్ని కంపెనీలు జనవరి ఒకటి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా పాటించకపోతే కంపెనీలు మూతపడాల్సిందేనని హెచ్చరించింది.
Also Read: ఈ జైలు మనదిరా..నడుమ పోలీసెందిరో..బెంగళూరు జైల్లో ఖైదీల మందు.. చిందు
ఇటీవల మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వల్ల 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేయస్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. దీంతో ఆ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఆ దగ్గు సిరప్‌లో 48.6 శాతం విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఈ దగ్గుమందు తయారీకి సంబంధించి సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సిరప్ మార్కెట్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు.
Also Read: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా.. కొత్త యాప్ వచ్చేసిందిగా
ఈ నిర్లక్ష్యం కారణంగానే పిల్లల మరణాలకు దారి తీసినట్లు తెలిపారు. సరైన తయారీ పద్ధతులు పాటించకపోవడం వల్లే 300లకు పైగా ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటన తర్వాత శ్రేసన్ ఫార్మా పర్మిషన్లను తమిళనాడు సర్కార్ రద్దు చేసింది. తాజాగా కేంద్రం అన్ని ఫార్మా కంపెనీలకు అల్టీమేటం జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us