Bengaluru Prison: ఈ జైలు మనదిరా..నడుమ పోలీసెందిరో..బెంగళూరు జైల్లో ఖైదీల మందు.. చిందు

డబ్బుంటే సుబ్బిగాడు..సుబ్బరాజు గారవుతారన్నట్లు..నేరం చేసిన వారు డబ్బుంటే జైల్లో ఉన్న ఎంజాయ్‌ చేస్తారనడానికి నిదర్శనం బెంగళూరు పరప్పన జైలు. ఇక్కడ జైలు ఖైదీలకు విఐపీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయంటే అతి శయోక్తి ఏం కాదు.

New Update
Prisoners' alcohol party in Bengaluru jail

Prisoners' alcohol party in Bengaluru jail

Bengaluru Central Prison : డబ్బుంటే సుబ్బిగాడు..సుబ్బరాజు గారవుతారన్నట్లు..నేరం చేసిన వారు డబ్బుంటే జైల్లో ఉన్న ఎంజాయ్‌ చేస్తారనడానికి నిదర్శనం బెంగళూరు పరప్పన జైలు. ఇక్కడ జైలు ఖైదీలకు విఐపీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయంటే అతి శయోక్తి ఏం కాదు. దానికి సాక్ష్యంగా పలు వీడియోలు కూడా విడుదలయ్యాయి.

వివరాల ప్రకారం..  బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో  బందీగా ఉన్న  మోస్ట్‌ వాంటేడ్‌ క్రిమినల్, ఐసిస్‌ రిక్రూటర్‌ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇటీవల సంచలనం సృష్టించించిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే తాజాగా అదే జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. దీంతో జైలు అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో జైల్లోని ఖైదీలు పాటలు పాడుతూ,డ్యాన్సులు చేస్తూ,  మందు పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో పలువురు డేంజర్‌ సంఘటనలకు పాల్పడిన ఖదీలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనేక ప్రమాదకర ఘటనల్లో నిందితులుగా ఉన్న  ఖైదీలకు జైల్లో వీఐపీ సౌకర్యాలు కల్పించినట్లు కనిపిస్తున్న వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైల్లో ఫోన్‌ వాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు ఐసిస్‌ రిక్రూటర్‌కు జైల్లో ఫోన్‌, టీవీ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఉన్న వీడియో ఇప్పటిది కాదని.. 2023 నాటిదని పేర్కొన్నారు. తాజాగా వైరలైన దృశ్యాలు మాత్రం వారం క్రితం తీసినట్లు తెలుస్తోంది. 

బెంగళూరు జైలుకు సంబంధించిన వరుస వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో  ఈ ఘటనలపై కర్ణాటక డైరెక్టర్ జనరల్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ అధికారులు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్‌లను ఎవరు లోపలికి తీసుకువెళ్లారు. వాటిని  ఖైదీలకు ఎవరు? ఎలా అందజేశారు  అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాగా జైలుకు సంబంధించి వరుసగా బయటకు వస్తున్న వీడియోలను ఎవరు మీడియాకు చేరవేస్తున్నారనే విషయం పైనా కూడా విచారణ జరుగుతుందన్నారు. దీనికి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. బెంగళూరు జైలులోని పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Also Read: Ustaad Bhagat Singh: "పవన్ ఫ్యాన్స్ హైప్ ఎక్కించుకోండమ్మా..." ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ స్వీట్ మెసేజ్..!

Advertisment
తాజా కథనాలు