ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి సర్.. తీరా చూస్తే పోలీసులు షాక్!

యూపీకి చెందిన ఓ వ్యక్తి తప్పతాగి పోలీసులకు ఫోన్ చేశాడు. తన ఇంట్లో దొంగలు పడ్డారని.. వెంటనే రావాలని తెలిపాడు. హుటా హుటిన అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆ వ్యక్తి షాక్ ఇచ్చాడు. పావుకిలో ఆలుగడ్డలు పోయాయంటూ చెప్పాడు. మళ్లీ ఇలా చేయొద్దని పోలీసులు మందలించారు.

up men
New Update

ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో రకరకాల వింత వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరొక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మా ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి సర్ అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు.

Also Read:  నవంబర్‌ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

పోలీసులు షాక్

దీంతో హుటా హుటిన బయల్దేరిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఏ ఏ వస్తువులు పోయాయ్ అని అడగ్గా ఆ వ్యక్తి చెప్పిన మాటలతో పోలీసులు ఖంగుతున్నారు. మళ్లీ ఎప్పుడూ ఇలా చేయొద్దని ఆ వ్యక్తిని మందలించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చెప్పాడు. పోలీసులు ఎందుకు అతడు చెప్పిన తర్వాత మందలించారు అనే విషయానికొస్తే..

Also Read:  కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి బాగా తప్పతాగి పోలీసులకు ఫోన్ చేశాడు. తన ఇంట్లో దొంగలు పడ్డారంటూ చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. తీరా చూస్తే తన ఇంట్లో పావుకిలో ఆలుగడ్డలు పోయాయంటూ తప్పతాగిన వ్యక్తి తాపీగా చెప్పాడు.

Also read: లెబనాన్‌ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...కూలిన భారీ భవనాలు!

అంతేకాదండోయ్ ఆ ఆలుగడ్డలు వంటకోసం తోలు వలిచి మరీ పెట్టుకున్నానని తెలిపాడు. వెంటనే పట్టుకురండి సర్ అని అనడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. దీంతో ఆ వ్యక్తిని మందలించారు. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని తెలిపారు. 

ఇలాంటిదే మరొకటి 

Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!

తాజాగా బీహార్‌కు చెందిన ఓ బాలుడు నకిలీ ఐపీఎస్‌గా బీహార్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బీహార్‌లోని జాముయి పోలీసులు మిథిలేష్ కుమార్ అనే బాలుడిని పట్టుకున్నారు. దీంతో తాను రూ. 2 లక్షలు చెల్లించి ఐపిఎస్ అయ్యాడని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఆ తరువాత పోలీసులు ఇదంతా నాటకమని గుర్తించారు. దీంతో రాత్రికి రాత్రే ఆ బాలుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

#viral-video #viral-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe