Ap: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో దారుణం జరిగింది. సుశాంత్ అనే యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ జూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. By Bhavana 02 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirupati: అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేశాడు ఓ దుర్మార్గుడు. చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. తరువాత చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా వడమాటపేట మడలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. Also Read: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత సుశాంత్ అనే యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. అనంతరం బాలికను చంపేసి పూడ్చిపెట్టాడు. Also Read: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే.. రాత్రి బాగా పొద్దుపోయినా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఏకంగా నలుగురు మైనర్లు ఆ బాలికపై లైంగిక దాడి చేశారు. ఇక రోజు ఎంతో చెలాకిగా ఆడుతూ పాడుతూ తిరిగే ఆ బాలిక.. అత్యాచారం జరిగిన తర్వాత నుంచి సైలెంట్ అయిపోయింది. నీరసంగా కనిపించడంతో ఒంట్లో బాలేదేమో అని తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో ఆ బాలిక అసలు విషయం చెప్పేసింది. Also Read: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే.. దీంతో వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులు నలుగురూ మైనర్లు కావడంతో పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. Also Read: మరో మూడు రోజులు జోరు వానలు..ఐఎండీ వార్నింగ్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి