Bank Holidays: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! నవంబర్ నెల లోకి వచ్చి అప్పుడే రెండు రోజులు అయిపోయింది.దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2024 బ్యాంక్ సెలవుల షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం నవంబర్ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. By Bhavana 02 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bank Holidays: నవంబర్ నెల లోకి వచ్చి అప్పుడే రెండు రోజులు అయిపోయింది.దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)నవంబర్ 2024 బ్యాంక్ సెలవుల షెడ్యూల్ను విడుదల చేసింది. సాధారణంగా ఆదివారంతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవులే. ఇవి కాకుండా ఈ నెలలో వచ్చే పండుగలతో పాటు ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం నవంబర్ నెలలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులను ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది. నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! నవంబర్ 1: దీపావళి సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ , సిక్కిం, మణిపూర్ లోని బ్యాంకులకు సెలవు. ఇక కర్ణాటకలో నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు సెలవు . నవంబర్ 2: దీపావళి, లక్ష్మీ, గోవర్థన్ పూజల కారణంగా.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థానం, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ రోజు సెలవు దినంగా పేర్కొంది. నవంబర్ 3: ఆదివారం కావడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవే. Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది! నవంబర్ 7: చాత్ పండుగ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. నవంబర్ 8: వంగల పండుగ కారణంగా బీహార్, జార్ఖండ్, మేఖాలయ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. నవంబర్ 9: రెండో శనివారం,నవంబర్ 10: ఆదివారం. Also Read: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త! నవంబర్ 15: కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి. దీంతో మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థానం, జమ్ము, ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లోని అన్ని బ్యాంకులకు సెలవు. Also Read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు! నవంబర్ 17: ఆదివారం, నవంబర్ 18: కనకాదాసు జయంతి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అన్ని బ్యాంకులకు సెలవు, నవంబర్ 23: నాల్గవ శనివారం, అంతే కాక మేఘాలయాలో సెంగ్ కుట్స్నెమ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. నవంబర్ 24: ఆదివారం సెలవే. Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి