/rtv/media/media_files/2025/02/17/tchMWHi64XuKhBlOu15x.jpg)
UP Jhansi district 19 passengers sitting in auto police stopped
సాధారణంగా ఒక ఆటోలో నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు కూర్చొంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక ఆటోలో డజనుకు పైగా కూర్చోగలరా? అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ ఆ అసాధ్యాన్ని ఓ ఆటో డ్రైవర్ సుసాధ్యం చేసి చిక్కుల్లో పడ్డాడు. పది కాదు పదిహేను కాదు ఏకంగా 19 మందిని ఆటోలో ఎక్కించాడు. అదే సమయంలో పోలీసుల కంట పడి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
ఒకరు కాదు ఇద్దరు కాదు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఓ ఆటోలో డజనుకు పైగా ప్రయాణికులు కూర్చున్న షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆటోలో చాలా మంది ప్రయాణికులు ఉండడం చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. ఒక్కొక్కరుగా లెక్కింపు ప్రారంభించగా.. ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 19 మంది కూర్చొన్నారు.
4 सीटर ऑटो में 19 सवारियां !!
— Sachin Gupta (@SachinGuptaUP) February 17, 2025
📍झांसी, उत्तर प्रदेश pic.twitter.com/GTu4AvhNxQ
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ఇక వైరల్ అవుతున్న వీడియోలో.. గత శనివారం రాత్రి ఝాన్సీలోని బారుసాగర్‌లో నాలుగు సీట్ల ఆటోలో 19 మంది కలిసి కూర్చొని ప్రయాణిస్తున్నారు. అయితే అదే సమయంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా ఈ ఆటో పోలీసుల కంట పడింది.
దీంతో ఆ ఆటోను పక్కకి ఆపి.. లోపల ఉన్న ఒక్కొక్కరిని బయటకు తీశారు. అలా ఒక్కొక్కరూ బయటకు వస్తూనే ఉన్నారు. మొత్తంగా అందులో డ్రైవర్‌తో సహా 19 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటో డ్రైవర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కఠిన ఆదేశాలు కూడా ఇచ్చారు.