Nitin Gadkari: త్వరలో టోల్‌ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ

జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్‌ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

New Update
Union Minister Nitin Gadkari

Union Minister Nitin Gadkari

జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్‌ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో దీనిగురించి మాట్లాడారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తుండటం వల్ల సుంకాల వసూలు తప్పనిసరి అని పేర్కొన్నారు. దేశంలో నాలుగు లేన్ల రహదారుల పైనే ప్రస్తుతం టోల్‌ పన్ను వసూలు చేస్తున్నామని.. రెండు లేన్ల రహదారులపై చేయడం లేదని చెప్పారు. 

Also Read: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?

2019-20లో రూ.27,503 కోట్లు టోల్‌ ట్యాక్స్ వసూలు చేయగా.. 2023-24లో ఇది రూ.64,809 కోట్లకు పెరిగిందని తెలిపారు. అలాగే 2023-24లో 18 ఏళ్లలోపు మైనర్ బాలబాలికల వల్ల 11,890 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా తమిళనాడలోనే 2,063 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు శాటిలైట్‌ల సాయంతో ప్రధాన రహదారులపై ట్యాక్స్ వసూలు చేసే వ్యవస్థపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.  

Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

ఇందులో భద్రతాపరమైన, వ్యక్తిగత గోప్యతాపరమైన అంశాలు లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. అయితే వాహనాలు టోల్‌ గోట్ల వద్ద ఆగకుండానే ఆటోమేటిగ్గా రుసుము చెల్లించేలా ఈ శాటిలైట్‌లు సాయపడతాయి. ప్రస్తుతం భారత్‌ తన నావిక్ వ్యవస్థ కింద పరిమిత సంఖ్యలోనే శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రయోగించింది. అంతర్జాతీయ యంత్రాంగమైన GNSSలో శాటిలైట్ల సాయంతో ఎలక్ట్రిక్ పన్ను వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.  

Also Read: జాన్ ఎఫ్‌ కెన్నడీ హత్య వెనుక సీఐఏ హస్తం !

Also Read: 12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు