'11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్‌ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్

రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Kishan Reddy

కిషన్ రెడ్డి

రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. "  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చింది. రైతులకు రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరి ధాన్యంతో పాటు పత్తిపై రూ.500 బోనస్ ఇస్తామంటూ ప్రకటించింది. కానీ ఈ హామీల అమలుకు నోచుకోలేదు.రైతులకు అరకొరగానే రుణమాఫీ జరిగింది. ధాన్యంపై బోనస్ పేరుతో మోసం చేసింది.

 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తమని చెప్పింది. అధికారంలోకి వచ్చాక సన్నవడ్లకే బోనస్ ఇస్తమని సన్నాయినొక్కులు నొక్కుతోంది. తెలంగాణలో రైతులు అత్యధికంగా దొడ్డువడ్లు మాత్రమే పండిస్తారు. ధాన్యం మార్కెట్ యార్డులోకి వచ్చి 2 నెలలు గడిచాక సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి నిబంధనలు పెడుతున్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే, 17 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ప్రచారంలో రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వాటిని కట్టొద్దని, డిసెంబరు 9న సోనియాగాంధీ జన్మదినం రోజున రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 11 నెలలు గడిచినా అది దిక్కులేదు.

Also Read: 'అలా చేయడం ఇష్టం లేదు'..తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం

100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తమని చెప్పారు. అమలు చేయకుండా మోసం చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.లక్షా 50 వేల కోట్లు ఎప్పుడొస్తాయో తెలియదు. మూసీలోకి వస్తున్న హైదరాబాద్ డ్రైనేజీని క్లీన్ చేస్తారో లేదో తెలియదు. కానీ.. రైతులను రెచ్చగొడుతూ మూసీకి ఇరువైపులా ఉన్న పేదల ఇళ్లను మాత్రం కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కల్లాలకు తీసుకొస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ వరి ధాన్యం విషయంలో ఢిల్లీలో ధర్నా చేశారు. అది ఎందుకు చేశారో ఆయనకే తెలియదు. గత 2 నెలలుగా ధాన్యం కొనుగులు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. 

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదు. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ధాన్యం కొనుగోలుపై ప్రతి నయా పైసా వడ్డీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర (రూ. 2,320), మండీ హమాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు నొప్పేంటి ?. 

Also Read: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ

కాంగ్రెస్ ప్రభుత్వం చాలావరకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కిలో వడ్లు కూడా కొనుగోలు చెయ్యలే. టార్పాలిన్లు, కాంటాలు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేవారు. నేడు మోదీ ప్రభుత్వం రాష్ట్రం నుంచి 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోంది. 2014లో ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.1300 ఉంటే.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఎంఎస్‌పీ రూ.2320కి పెరిగింది.

Also Read: RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు