/rtv/media/media_files/2025/08/06/india-trump-2025-08-06-22-13-21.jpg)
India Hit Back Trump Tariffs
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై బాంబు వేసేశారు. ఇప్పటికే ఉన్న 25 శాతానికి తోడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు 25 శాతం ప్రకటించగా మొత్తం కలిపి 50 శాతం సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది అందుకే ఈ సుంకాల విధింపు అంటూ అధ్యక్షుడు ట్రంప్ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో తెలిపారు. దీని ప్రకారం వర్తించే చట్టానికి అనుగుణంగా, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలోకి దిగుమతి చేసుకున్న భారతదేశ వస్తువులు 25 శాతం అదనపు సుంకాలు కట్టవలసి ఉంటుంది. భారత్ అమెరికాతో భారీగా వ్యాపారం చేస్తోంది కానీ..ఇప్పటి వరకు తాము మాత్రం అలా చేయలేదని ట్రంప్ అన్నారు. ఇక మీదట అలా ఉండదని..అందుకే టారీఫ్ లను పంచామని తెలిపారు. ఇప్పటికే ట్రంప్ విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ట్రంప్ తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
Also Read : ఏలియన్స్ వస్తున్నాయి.. సౌరకుటుంబంలోకి కొత్త గ్రహం
US President Donald Trump imposes an additional 25% tariff on India over Russian oil purchases
— ANI (@ANI) August 6, 2025
On July 30, Trump had announced 25% tariffs on India. pic.twitter.com/NHUc9oh0JY
Also Read : ఫ్రాన్స్‌లో కార్చిచ్చు బీభత్సం.. 12వేల హెక్టార్ల అడవి దగ్ధం
అన్యాయం, అసమంజసం...
ట్రంప్ నిర్ణయంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో పాటూ నిరాశను కూడా వ్యక్తం చేసింది. ఇదొక దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించింది. ఇతర దేశాలు కూడా తమ సొంత ప్రోజనాలను చూసుకుంటున్నాయని...కానీ తమపైనే ట్రంప్ ఈ విధంగా టారీఫ్ లు వేయడం చాలా అన్యాయమని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుని వాదన, నిర్ణయం రెండూ చాలా అసమంజసమైనవి అంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక రష్యా నుంచి చమురు దిగుమతిపై ఇప్పటికే తమ వైఖరిని తెలియజేశామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మార్కెట్, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడే తమ నిర్ణయాలు ఉంటాయని మరోసారి తెలిపింది. 140 కోట్లమంది దేశ ప్రజల ఇంధన భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది.
Also Read: Trump Tariffs: ట్రంప్ 50% సుంకాలతో భారత్‌కు వచ్చే నష్టం ఇదే!